కాళేశ్వరంపై కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలు

Mon,August 12, 2019 02:39 AM

-జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధం
-కాంగ్రెస్ హయాంలో జేబులు నింపుకొనేందుకే కాలువలు తవ్వారు
-సీఎం కేసీఆర్‌ను కొనియాడిన విపిన్‌చంద్రను చూసి బుద్ధి తెచ్చుకోండి
-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
కుమార్సారంగాపూర్ : వానలు వాపస్ రావాలన్నా.. కోతులు వాపస్ పోవాలన్న గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బీర్‌పూర్ మండలంలోని చర్లపల్లి శివారు అడవుల్లో ఆదివా రం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, అధికారులు, ప్ర జాప్రతినిధులతో కలిసి పండ్ల మొక్కలను నాటా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో అడవులు అంతరించి పో యాయన్నారు. ఈ రోజు అడవులు అంతరించి పోతుండడంతో విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయనీ, జగిత్యాల ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగి వేడి నెల కొందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ము ఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమంలో భాగం గా రాష్ట్రంలో కొన్ని కోట్ల మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి అందులో గ్రా మానికి అవసరమైన 50 నుంచి 70 వేల వరకు మొక్కలు నాటుతున్నారని అన్నారు.

ప్రస్తుతం గ్రామాల్లో, పట్టాణాల్లో ఎక్కడ చూసినా కోతులు కనిపిస్తున్నాయనీ, నాడు కోతులను చూడాలంటే కొండగట్టుకు వెళ్లేవారమని పేర్కొన్నారు. కోతు లు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు రాకుండా ఉం డేందుకు అడవిలోనే వాటికి సంబంధించిన 13 రకాల పండ్ల మొక్కలను నాటుతామన్నారు. అడవుల్లో రావి, మర్రి, సీమచింత, వెలగ, మారేడు, నేరేడు, చింత, బాదం మొక్కలను నాటుతున్న ట్లు తెలిపారు. చర్లపల్లి గ్రామ శివారులో బ్లాకును తహసీల్దార్ దిలీప్‌కు అటాచ్ చేయడంతో పండ్ల మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నా టి సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని చేరుకోవాలని సూ చించారు. గ్రామాల్లో యువ సర్పంచులు వచ్చారనీ, అందరి భాగసామ్యంతో విరివిగా మొక్కలు నా టాలనీ, ఎవరైనా చెట్టు నరికితే వారి పై కేసులు న మోదు చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా మొ క్కలు పెడితే ఒక్క చెట్టుకు గుంత తీసినందుకు రూ.18, మొక్కపెడితే రూ.3.40పైసలు, నీరుపోస్తే రూ. 5, మొ క్కకు కంచె ఏర్పాటు చేస్తే రూ.140 ప్రభుత్వం ఇ స్తుందన్నారు.

బీర్‌పూర్ మండలంలో భూగర్భ జ లాలు పైనే ఉన్నాయనీ, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటి గ్రామాలను నందన వనాల్లా త యారు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీ శ్రీనివాస్, జిల్లా రైతు సమన్వయ సమితి స భ్యుడు కొల్ముల రమణ, సర్పంచులు ప్రభాకర్, సుస్మిత, మేసు ఏసుదాసు, ఎలగందుల లక్ష్మి, సీపతి రమేశ్, రిక్కల ప్రభాకర్, పర్వతం రమేశ్, చుంచు శారద, మైపాల్ రెడ్డి, బందెల మరియ, గ ర్షకుర్తి శిల్ప, నారపాక రమ, పార్టీ మండలాధ్యక్షు డు నారపాక రమేశ్, యూత్ అధ్యక్షుడు గంగధరి సంతోష్ గౌడ్, నాయకులు ముక్క శంకర్, దోసారపు బుచ్చన్న, గంగాధర్, శ్రీనివాస్, నారపాక అ శోక్, లక్ష్మణ్, గర్షకుర్తి రమేశ్, రవి, సంతోష్, నరేందర్, రమేశ్, చిక్కం మారుతి, ఎస్‌ఐ శీలం రాజ య్య, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles