కాళేశ్వరంపై కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలు

Mon,August 12, 2019 02:31 AM

నమస్తే తెలంగాణ, జగిత్యాల ప్రతినిధి : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు, ముఖ్యం గా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్ విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అ సంబద్ధమైనవన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్ట డం వల్ల రెండు పంపుహౌస్‌లు నిర్మించాల్సి వ చ్చిందనీ, దీనికి అనవసరంగా నిధులు వృథా చేశారని కాంగెస్ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే కాలువలు తవ్వి 50శాతం పనులు పూర్తి చేశామని జీవన్‌రెడ్డి పేర్కొనడం సరికాదన్నారు. అనవసరంగా కాలువలు తవ్వి కాంట్రాక్టర్లకు, కాంగ్రెస్ నాయకులు జేబులు నింపారని ఎమ్మెల్యే సంజ య్ విమర్శించారు. తమ్మడిహట్టి వద్ద కట్టాల్సింది అని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ నాయకులు, వారి హయాంలో ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. తమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
అప్పుడు కేంద్రంలో, రా ష్ట్రంలో, మహారాష్ట్రలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేననీ, మరి ఆ పార్టీ నాయకులు ఎందుకు చొరవ తీసుకొని తమ్మడిహట్టి వద్ద నిర్మాణం చేపట్టలేదని నిలదీశారు. జల వనరుల శాఖ నిపుణులు, సాగునీటి రంగ నిపుణులు తమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని తేల్చిచెప్పారనీ, అందుకే మేడిగడ్డ వద్ద టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రా జెక్టు నిర్మాణం చేపట్టిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్మించిందనీ, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందనీ, తెలంగాణ మొత్తం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణం పూర్తయి, పంట పొలాలకు నీళ్లు వచ్చే పరిస్థితుల్లో, ఇక తమకు భవిష్యత్తు లేదని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును అని చెప్పుకునే జీవన్‌రెడ్డి, ప్రతి సందర్భంలోనూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జీవన్‌రెడ్డి తన వైఖరిని ఇలాగే కొ నసాగిస్తే, ప్రజల విశ్వాసాన్ని కోల్పోక తప్పదన్నా రు. ఇప్పటికే జీవన్‌రెడ్డి జగిత్యాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ప్రభుత్వం సరైన మా ర్గంలో నడిచేలా ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయాలే తప్ప, విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అనే తీరులో ఉండొద్దని హితవుపలికారు.

జీవన్‌రెడ్డికి విమర్శలు చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిందన్నారు. కేంద్ర జలవనరుల శాఖ ప్రధాన అధికా రి విపిన్‌చంద్ర కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకొని, సీఎం కేసీఆర్‌కు నోబెల్ బహుమతి ఇ వ్వాలని అభిప్రాయపడిన విషయాన్ని ప్రతి పక్ష నాయకులు అంగీకరించాలన్నారు. అధికారులకు ఉన్న సోయి, ప్రతిపక్ష నాయకులకు లేకపోవడం బాధాకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ పూర్తయిందనీ, త్వరలోనే నందిమేడారం, లక్ష్మీపూర్ నుంచి మిడ్‌మానేరుకు నీరు చేరుతుందన్నారు. పది, పదిహేను రోజుల్లో ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి సైతం రోజుకు అర టీఎంసీ నీరు వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు వరదాయిని అనీ, దానిపై ప్రతిపక్షాలు కువిమర్శలు చేయడం సంస్కారం కాదన్నారు. దే శంలో ఏ ప్రాజెక్టునూ ఇంత వేగంగా నిర్మించలేద నీ, అంకితభావంతో మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. స మావేశంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, నాయకులు కొల్ముల రమణ, తదితరులు ఉన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles