గల్ఫ్ బాధితులకు కార్పొరేషన్

Mon,August 12, 2019 02:30 AM

-రుణాలు ఇప్పించాలి
గొల్లపల్లి : మండలంలోని దమ్మన్నపేటకు చెందిన గల్ఫ్ బాధితులు ఆదివారం గ్రామ సర్పంచ్ మిత్కు అనసూర్య చంద్రయ్య సహకారంతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కరీంనగర్‌లో కలిసి కార్పొరేషన్ రుణాలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితులు మాట్లాడుతూ సౌదీ అరేబియా నుంచి ఇటీవల మండలంలోని పలు గ్రామాలకు చెందిన గల్ఫ్ బాధితులు స్వగ్రామాలకు తిరిగొచ్చారన్నారు. గల్ఫ్ బాధితులకు స్వయం ఉపాధి మార్గాలు చూపించాలని కోరారు. గల్ఫ్ బాధితులకు కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి స్వయం ఉపాధిని కల్పించి ఆదుకోవాలని మంత్రికి విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles