టీబీసీ ఐకాస రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నాయకులు

Mon,August 12, 2019 02:29 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యవర్గంలో గ్రామానికి చెందిన న్యాయవాది క్యాస రఘునందన్ రెడ్డిని టీబీసీ ఐకాస రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన వెల్ముల ప్రకాశ్‌ను టీబీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా రఘునందన్, ప్రకాశ్‌లు మాట్లాడుతూ బీసీల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్న తమపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారి విజయ్, సింగం భాస్కర్, రాజగోపాలచారి, ములస్తం శివప్రసాద్, లక్ష్మణ్, రుద్ర రవి, కృష్ణమూర్తి, కూసరి అనిల్, మనోహర్, పుప్పాల విజయ, కస్తూరి శ్రీమంజరి, పుప్పాల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles