తూముల వద్ద గ్రామస్తుల పూజలు

Mon,August 12, 2019 02:29 AM

కొడిమ్యాల: గోదా వరి నీటితో చెరువులను నింపేందుకు ఏర్పాటు చేసిన గ్రావిటీ కెనాల్ తూము వద్ద నల్లగొండ గ్రామస్తులు ఆదివారం పూజలు చేశారు. మండలంలోని నల్లగొండ ఊర చెరువుతోపాటు గొలుసు కట్టు చెరువులను నింపేందుకు కొండాపూర్ మైసమ్మ చెరువు నుంచి వేములవాడకు వేళ్లే గ్రావిటీ కెనాల్‌కు ఏర్పాటు చేసిన తూం వద్ద గ్రామస్తులు పూజలు చేశారు. కాగా నల్లగొండ ఊరచెరువు, రామకిష్టాపూర్ ఊర చెరువుతోపాటు గొలుసుకట్టు చెరువులను నింపేందుకు ఇటీవల ప్రభుత్వం రూ.12 లక్షల వ్యయంతో గ్రావిటీ కె నాల్‌కు తూములు ఏర్పాటు చేసింది. ఈ సం దర్భంగా చెరువులు, కుంటలను నింపేందుకు తూంలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ఏఈ గోవిందు, సర్పంచ్‌లు పిల్లి మల్లేశం, గుంటి లక్ష్మీదేవి, నాయకులు చీకట్ల మహేందర్, తిరుపతి, గజ్జెల నవీన్, దండు మల్లయ్య, కుక్కల గంగయ్య, గిద్దామారి లచ్చయ్య, దండు రాము లు, మొగిలి శంకరయ్య, నిషాని నర్సయ్య, బోగో జీ శ్రీనివాస్, మ్యాకల సత్యనారాయణ, లెంకల లచ్చయ్య ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles