వాట్సాప్‌లోనూ ఫిర్యాదు చేయండి

Sat,August 10, 2019 03:00 AM

-నేరుగా రానివారికి, దూర ప్రాంతాల వారికి సౌకర్యం
-పోలీసు సేవల్ని మరింత చేరువ చేసేందుకే సదుపాయం
-ఎస్పీ సింధూశర్మ
-ఫిర్యాదులకు వాట్సాప్ నంబర్ 9346987153 ఆవిష్కరణ
జగిత్యాల క్రైం : పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఇప్పటి వరకు నేరుగా స్టేషన్‌కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. విరవిగా వినియోగిస్తున్న వాట్సాప్ ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నంబరును ఎస్పీ సింధూశర్మ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఫిర్యాదులు నేరుగా చేయలేని వారు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు 9346987153 నంబరుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులను పంపించవచ్చన్నారు. అత్యధిక మంది ప్రజలు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాద్యమాలను వినియోగిస్తున్నారనీ, దీనికనుగుణంగానే జిల్లాలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని ప్రారంభించామన్నారు. పోలీసు సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఫిర్యాదులు, నేరాలు, ఉమెన్ హరాస్‌మెంట్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనీ, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సైతం వాట్సాప్ ద్వారా పంపవచ్చన్నారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు, సహాయం కోరే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎల్లవేళలా వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండే విధంగా ఐటీ కోర్ టీంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదును స్వీకరించి వెంటనే స్పందించి ఆ పరిధిలోని డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు అందచే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పెల్లి, జగిత్యాల డీఎస్పీలు మల్లారెడ్డి, వెంకటరమణ, ఐటీ కోర్ ఎస్‌ఐ సుధాకర్ పొల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles