వర్షపు నీటిని వృథా కానీయవద్దు

Sat,August 10, 2019 02:58 AM

మేడిపల్లి: వర్షపు నీటిని వృథా కానీయవద్దనీ, ఇంటిం టా ఇంకుడుగుంతలు, చేతిపంపుల వద్ద షోఫీట్, పాంపాండ్‌లను నిర్మించుకోవాలని ఐఏఎస్ అధికారి మనుచౌదరి సూచించారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా మండలంలోని తొంబర్‌రావుపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్మించిన షోఫీట్‌ను శుక్రవారం కేంద్రం నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి మనుచౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకుడుగుంతలు, పాంపాండ్, షోఫీట్‌లు నిర్మించిడంతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. మొక్కలు నాటడంతో సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మామిడి సత్తమ్మ, జిల్లా విజిలెన్స్ అధికారి చిన్నయ్య, ఎంపీడీఓ రవీందర్, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, కారోబార్ నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

మల్యాల: మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న జలశక్తి అభియాన్ పనులను కేంద్ర బృందం సభ్యుడు మనూచౌదరి శుక్రవారం పరిశీలించారు. మానాల గ్రామంలో నిర్మిస్తున్న పాంపాండ్ నిర్మాణ పనులతో పాటు మద్దుట్ల, రామన్నపేట గ్రామాల్లో నిర్మిస్తున్న బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ పనులు, హరితహారం పనులను పరిశీలించారు. అనంతరం మనూచౌదరి మాట్లాడుతూ.. జలశక్తి అభియాన్ ద్వారా చేపడుతున్న పలు పనులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పనుల ద్వారా పొందే లబ్ధి వివరాల ఆవశ్యకతను కూడా అవగాహన సదస్సుల ద్వారా వివరించాలన్నారు. జలశక్తి అభియాన్‌లో ప్రధానంగా ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు. తద్వారా భవిష్యత్‌లో నీటి ఎద్దడిని నివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. వీటి ద్వారా వచ్చే ఫలితాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్, ఈవోపీఆర్డీ జనార్దన్, ఏపీవో లోకేశ్వరి, ఈజీఎస్ ఈసీ మనోజ్, ఎంపీటీసీ సభ్యులు పోతాని రవి, సఫియా వలీబేగం, సర్పంచులు గడ్డం జలజ, కెల్లేటి మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles