రాజారాంపల్లిలో తల్లిపాల వారోత్సవాలు

Sat,August 10, 2019 02:57 AM

పెగడపల్లి : మండలం రాజారాంపల్లిలో శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంతో మేలని, పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు పాలు తప్పనిసరిగా తాగించాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయిని సత్తమ్మ, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మి, భాగ్య, ఆయాలు, తల్లులు, నాయకులు సాయిని రవీందర్, సింగిరెడ్డి మల్లారెడ్డి, ఇటిక్యాల ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles