ధర్మపురికి మహర్దశ

Fri,August 9, 2019 02:17 AM

-క్షేత్రం, పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వెల్లువ
-ఆలయానికి రూ. వంద కోట్లు
-మున్సిపాలిటీకి రూ.35కోట్లు
-ప్రతి పంచాయతీకి రూ.10లక్షలు
-మండలానికి రూ.25లక్షలు
-పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు
-సీఎం కేసీఆర్ వరాల జల్లు
-నియోజకవర్గంపై మంత్రి కొప్పుల తనదైన ముద్ర

జగిత్యాల ప్రతినిధి,నమస్తే తెలంగాణ: గోదావరి నది దక్షిణ వాహినిగా సాగే పవిత్ర స్థ లం ధర్మపురి. అడుగడుగునా ఆలయాలతో అలరారిన నగరం. హిందు, ముస్లిం, బౌ ద్ధం, జైన మతాలకు ఆలవాలం. అనాదిగా సంగీత, సాహితీ మూర్తులు, ఘనాపాఠీలు, వేదవేదాంగ పండితులు నడయాడిన నేల. కానీ, సీమాంధ్ర నేతల పాలనలో దశాబ్దాల పాటు తన ఉనికి, ప్రభావాన్ని కోల్పోయిం ది. గత వైభవం కోసం దీనంగా ఎదురు చూస్తూ కునారిల్లింది. సౌకర్యాలు లేక, చరిత్రలో గుర్తింపు లేక తల్లడిల్లింది. మొత్తంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. పశ్చిమంలో జనించి, తూర్పుగా పయనించి, బంగాళాఖాతంలో కలిసే గోదావరి నది దక్షిణ వాహినిగా సాగే క్షేత్రమైనా గోదావరి నది పుష్కరాల్లో సరైన ఆదరణకు నోచుకోలేకపోయింది.

పదిహేనేళ్ల క్రితం వరకు పాలకుల పట్టింపు లేక ప్రాభవం కోల్పోయిన ఈ ధార్మిక క్షేత్రం నేడు తన పూర్వవైభవాన్ని సంతరించుకోబోతున్నది. స్వరాష్ట్రంలో తిరిగి తన గత కాలపు ఘన కీర్తికి చేరువవుతున్నది. గోదావరి నది అంటే ధర్మపురి, ధర్మపురి అంటే ఆలయాల నగరం అని తిరిగి పిలుచుకునే స్థితికి చేరుకోబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో ధర్మపురి సగర్వంగా తలెత్తుకునేలా ఎదగబోతున్నది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా నిధులు సాధించి ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్న ధర్మపురి, నర్సన్న సాక్షి గా సీఎం కేసీఆర్ మంగళవారం కురిపించిన నిధుల వర్షంలో తడిసి ముద్దయిం ది. ధర్మపురి చరిత్రలో ఏనాడూ రా నన్ని నిధులను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పట్టణవాసుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తున్నది.

ఆలయాభివృద్ధికి రూ.వందకోట్లు
ధర్మపురి పుణ్యక్షేత్రంలోని ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, సకల సౌకర్యాలు కల్పించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వంద కోట్లు మంజూరు చేసింది. గతంలోనే రాష్ట్ర బడ్జెట్‌లో ఆలయాభివృద్ధికి రూ.50కోట్లు కేటాయించింది. తాజాగా సీఎం కేసీఆర్ మరో రూ.50కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతున్నది. రూ.50కోట్లు విడతల వారీగా మంజూరు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆలయాల పునరుద్ధరణ, ఇతర సౌకర్యాల కల్పనపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నృసింహాలయం పక్కనే ఉన్న రామలింగేశ్వరాలయాన్ని ప్రధాన ఆలయ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరముందన్నారు. బ్రహ్మపుష్కరిని సైతం ఆలయానికి సమీపంలోనే ఉందనీ, దాన్ని కూడా ఆలయం పరిధిలోకి తెచ్చే అంశాన్ని చర్చించాలన్నారు. ఆలయానికి వెళ్లే దారి ఇరుగ్గా ఉన్న నేపథ్యంలో దాన్ని విస్తరించాల్సిన అవసరముందనీ, ఇండ్లకు నష్టపరిహారం చెల్లించి సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. వీటితో పాటు, పట్టణంలోని రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆలయంలో స్వామివారి సేవకు అవసరమైన నందనవనాన్ని సైతం అభివృద్ధి చేసుకోవా ల్సి ఉందన్నారు. యాదాద్రికి పూర్వవైభవం కల్పిస్తున్న ఆనంద్‌సాయి కన్సల్టెన్సీ స్థపతుల ఆధ్వర్యంలో ధర్మపురి ఆలయాల ను కూడా సకల సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు.

పట్టణాభివృద్ధికి రూ.35కోట్లు
ధర్మపురి పట్టణాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.35కోట్లు ప్రకటించారు. 2018 వరకు పంచాయతీగా ఉన్న ధర్మపురిని ము న్సిపాలిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కొత్తగా మున్సిపాలిటీగా ప్రకటించిన సందర్భంలోనే అప్పటి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ధర్మపురికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో పట్టణాభివృద్ధి పనులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. సీఎం కేసీఆర్ సందర్శించిన సమయంలో చరిత్రలో ధర్మపురి ధార్మిక క్షేత్రం లా భాసిల్లాలని ఆకాంక్షించారు. రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన కోసం పట్టణానికి మరో రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మంజూరు చేసిన రూ.25కోట్లతో పాటు తాజాగా ముఖ్యమంత్రి మరో రూ.10కోట్లు కేటాయించడంతో ఇక ధర్మపురి రూపురేఖలు మారిపోనున్నాయి.
ప్రతి పంచాయతీకి రూ.పది లక్షలు ..
ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పుణ్యక్షేత్రమైన ధర్మపురి పేరుతో ఉన్న నియోజకవర్గం మొత్తానికి గౌరవాన్ని ఆపాదిస్తూ, ఏకంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ నిధులు ఉండేలా చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో 149 గ్రామ పంచాయతీలు ఉండ గా, ప్రతి గ్రామానికీ రూ. పది లక్షల చొ ప్పున నిధులిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు మండల కేంద్రాలకు కూడా రూ. 25లక్షల చొ ప్పున మొ త్తంగా రూ.1.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వీటి తో పాటు పట్టణంలోని మురుగునీరు గోదావరిలోకి చేరి, నీరు కలుషితమవుతున్నదనీ, కలుషితమైన నీటిని శుద్ధి చేసేందుకు కేం ద్రాన్ని ఏ ర్పాటు చేస్తామని ప్రకటించారు. గో దావరి నది పరీవాహక ప్రాంతంలో ప ర్యాటక శాఖ నేతృత్వంలో ఆనందవనా న్ని ఏర్పా టు చేస్తామనీ, ఇందుకోసం పర్యాటక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

స్వరాష్ట్రంలో ప్రగతి పథం వైపు ధర్మపురి
స్వరాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి ధర్మపురి పుణ్యక్షేత్రం ప్రగతిపథం వైపు సాగుతున్నది. గతంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా అవస్థలు పడి, అ భివృద్ధికి దూరంగా, ప్రగతికి నోచుకోకుండా ఉన్న నియోజకవర్గం, క్రమం గా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. ధర్మపురి నియోజకవర్గానికి సాగు నీటిని అందించే రోళ్లవాగు ప్రా జెక్టుకు రూ.63కోట్లు కేటాయించి, ఆధునికీకరణ పనులు చేపట్టారు. నియోజకవర్గంలో దాదాపు 8 ఎత్తిపోతల పథకాలతో నీటిని ఎత్తిపోసి, 30వేల ఎకరాల భూమిని ఆయకట్టు పరిధిలోకి తెచ్చే ప్రయత్నం దాదాపు పూర్తి కావచ్చింది. ఇవి కాకుండా కాకతీయ కాలువకు తూములు ఏర్పాటు చేసి పలు గ్రామాలకు సాగునీటిని తెచ్చే కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. సాగు, తాగునీటి కోసం నియోజకవర్గంలో అనేక చర్యలు తీసుకున్నారు.

సంక్షేమ పథకాల అమలుకూ కేరాఫ్ ..
ధర్మపురి నియోజకవర్గం సంక్షేమ పథకాల అమలుకు సైతం కేరాఫ్‌గా నిలిచింది. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, సబ్సి డీ ట్రాక్టర్ల పంపిణీ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, సీఎంఆర్ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ముందున్నది.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles