శ్రీరాములపల్లిలో గ్రామసభ

Fri,August 9, 2019 02:13 AM

గొల్లపల్లి : మండలంలోని శ్రీరాములపల్లిలో గురువారం సర్పంచ్ నేరెళ్ల గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణకు ట్రీగార్డుల ఏర్పాటు, సీసీ కెమెరాల నిర్వాహణకు పలువురు విరాళాలను అందజేశారు. ఈ సంద ర్భంగా సర్పంచ్ నేరెళ్ల గంగారెడ్డి 10వేలు, కిష్టంపేట రాంచందర్ రెడ్డి 10వేలు, బొమ్మ ఆంజనేయులు 5వేలు, లంబ ధనవ్వ 5వేలు, రేవెళ్ల లక్ష్మణ్ 5వేలు, ఎలేటి ఆశిరెడ్డి 5వేలు, తరాల అనిల్ 5వేలు, బొల్లం లక్ష్మి 2వేలు, నేరెళ్ల దశగౌడ్ 1000, చిప్ప రాధ 1000ల విరాళాలను అందజేశారు. విరాళాలు అందజే సిన ప్రతి ఒక్కరికీ సర్పంచ్ గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమవంతు సాయం అందజేయాలని కోరారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles