పశు బీమా సద్వినియోగం చేసుకోవాలి

Fri,August 9, 2019 02:13 AM

పెగడపల్లి: మండలంలోని రైతులు పశు బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి విక్రమ్‌కుమార్ గురు వారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రభత్వం పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తుందని వివరించారు. పశువు విలువలో 4శాతం ప్రీమియంగా చెల్లిస్తే, ఏడాది పాటు పశువుకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 97043 51229 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles