గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు..

Fri,August 9, 2019 02:13 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ: పాలిచ్చే తల్లులు ఆకుకూరలు, పాలు, పండ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సీడీపీవో అరుణ సూచించా రు. గురువారం ధర్మపురి మండలకేంద్రంతో పాటు ధమ్మన్నపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ అరుణ మాట్లాడుతూ ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. జడ్పీటీసీ బత్తిని అరుణ, హెచ్‌ఈఓ రాజిరెడ్డి, సూపర్‌వైజర్లు అరుణశ్రీ, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులున్నారు.
గొల్లపల్లి : మండలంలోని ఇస్రాజ్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గురువా రం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిర్ర గంగాధర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవ శ్యకతను వివరించారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పని సరిగా తాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ వెంకటేశ్ గౌడ్, కార్యదర్శి బాలె ప్రమోద్, ప్రాథమికోన్నత పాఠశా ల ప్రధానోపాధ్యాయుడు అంబాజి నాయక్, మారంపెల్లి లచ్చయ్య, వార్డు సభ్యులు బైరం నారాయణ, చిర్ర చంద్రయ్య, అంగన్ వాడీ టీచ ర్లు బోయిని పద్మ, గజ్జెల సత్తవ్వ, ఫీల్డ్ అసిస్టెంట్ చిర్ర రాజేందర్, ఆశ కార్యకర్తలు మద్దెల లక్ష్మి, రాసమల్ల సునిత, తదితరులు పాల్గొన్నారు.
వెల్గటూరు: మండలంలోని గుల్లకోటలో గల అంగన్‌వాడీ సెంటర్లలో అం గన్‌వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. చిన్నారులకు అన్నప్రసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ పొన్నం స్వరూప, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles