రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

Fri,August 9, 2019 02:12 AM

పెగడపల్లి : ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఉపాధి కోసం పాడి పశువులకు అందజేస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు కాసుగంటి రాజేందర్‌రావు సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కా ర్యాలయంలో ఎంపీపీ గోలి శోభ అధ్యక్షతన ఎస్సి కార్పోరేషన్ ద్వారా 2018-19 గానూ 60 శాతం సబ్సిడీ కింద పా డి పశువుల యూనిట్లు పొందేందకు దరఖాస్తుదారులకు అ వగాహన, ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సం దర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీల సంక్షే మం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని వివరించారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థిక ప్రయోజనం పొందేందకు సబ్సిడీ రుణాలను అందిస్తోందనీ, వీటిని పూర్తి స్థాయిలో వినియోగొంచుకోవాలని తెలిపారు. పాడి పశువుల ద్వారా పాలను సేకరించి అమ్ముకోవడం వల్ల ఉపా ధి లభిస్తుందనీ, ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని జడ్పీటీసీ సూచించారు. ఎంపీపీ శోభ మాట్లాడుతూ ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేసి బ్యాంకర్ల సహాయంతో గేదెల యూ నిట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

రుణాలు ఇచ్చేందుకు అబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసిన అనంతరం వాటి మంజూరుకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని వివరించారు. ఎంపీడీవో జయశీల మాట్లాడుతూ దళిత కుటుంబాలను ఉన్నతంగా ఉంచేందుకు జిల్లాలోనే పెగడపల్లి మండలాన్ని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 15 వరకు అర ఎకరం పైన వ్యవసాయ భూమి ఉన్న వారు ఇం కా ఎవరైనా కులం, ఆదాయం, ఆధార్ ధ్రువీకరణ పత్రాలతో మండల పరిషత్‌లో దరఖాస్తు చేసుకోవాలనీ, గేదెల యూనిట్లు పొందిన లబ్ధ్దిదారులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, తాసిల్దార్ సరిత, పశువైద్యాధికారి విక్రమ్, మండల సెర్ప్ ఏపీఎం సమత, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఇనుకొండ మోహన్‌రెడ్డి, కమిటీ సభ్యులు గోలి సురేందర్‌రెడ్డి, కోరుకంటి రాజేశ్వర్‌రావు, లోక మల్లారెడ్డి, పెగడపల్లి కేడీసీసీ, బతికపల్లి టీజీబీ, పెగడపల్లి ఎస్‌బీఐ, గోపాల్‌రావు పేట ఆం ధ్రాబ్యాంకు, బూర్గుపల్లి టీజీబీ, ఆరవల్లి యూబిఐ మేనేజర్లు మల్లేశం, శిరామకృష్ణారెడ్డి, మనోజ్, సందీప్‌బాబు, సమియుల్లా, వేణు, హరికృష్ణ, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles