ఉపాధ్యాయుడి ఔదార్యం

Fri,August 9, 2019 02:12 AM

వెల్గటూరు: వెల్గటూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు పెద్దూరి శంకర్ తన కూతురు జా నకి పుట్టిన రోజు సందర్భంగా వెల్గటూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సంబంధించిన తొమ్మి ది మంది పేద విద్యార్థులకు తన నెల జీతం రూ. 35 వేలు అందజేసి ఔదార్యాన్ని చాటారు. వెల్గటూరు గ్రామానికి చెందిన శంకర్ పేద కుటుంబంలో పుట్టి చిన్న ప్పుడు అనేక కష్టాలను అనుభవించాడు. ఈక్రమంలో పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేయాలని ముందుకు వచ్చాడు.

వెల్గటూరు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు చౌహాన్ పూజ, గుమ్ముల హర్షిత్, బూరగ డ్డ రక్షిత, గుమ్ముల వైష్ణవికి రూ. 2,500 చొప్పున రూ.10 వేలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెంది న జీ రాజేందర్, పీ వెంకటేశ్, సమత, వెంకటేశ్, మారుతికి రూ.5వేల చొప్పు న రూ.25వేలు అందజేశాడు. ఈ సందర్భంగా శంక ర్ మాట్లాడుతూ పదోతరగతి వరకు ఇక్కడే చదువుకున్నానని తెలిపారు. విద్యా, బుద్దులను అం దించి మంచి జీవితాన్ని ప్రసాదించిన ఇక్కడి పా ఠశాలకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో బత్తుల భూ మయ్య, సర్పంచ్ మేరుగు మురళీగౌడ్, ఎంపీటీసీ పెద్దూరి హారిక, ఎస్‌ఎంసీ చైర్మన్ రాపాక రాజ య్య, జూపాక కిరణ్ పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles