కాళేశ్వరంలో బాహుబలే కీలకం

Fri,August 9, 2019 02:11 AM

రామడుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష్మీపూర్‌లోని బాహుబలి మోటర్‌కు పెద్దపీట వేసినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పే ర్కొన్నారు. మండలంలోని లక్ష్మీపూర్‌లోగల కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీని శుక్రవారం మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సం దర్శించనుండగా, గురువారం మధ్యాహ్నం ప్రా జెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డితో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంగణంలోని అతిథి గృహంలో ఈఎన్సీతో వెట్న్‌ప్రై ఎమ్మెల్యే చర్చించారు. ఈఎన్సీ వెంకటేశ్వ ర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి మాట్లాడు తూ, సీఎం ఆదేశాల మేరకు మరికొన్ని రోజుల్లో బాహుబలి మోటర్ వెట్న్ నిర్వహిస్తామన్నారు. పంద్రాగస్టు వరకు మధ్యమానేరుకు కాళేశ్వరం నీటిని తరలిస్తామని ధర్మపురి సమావేశంలో ము ఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తెలిపారని గుర్తుచేశారు.

ఈ నెలాఖరులో ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా ఎత్తిపోతలు చేపట్టి శ్రీరాంసాగర్‌కు కూడా నీటిని తరలించే అవకాశముందన్నారు. ఈ నెల 5న నందిమేడారం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి, జంట సొరంగాల ద్వారా లక్ష్మీపూర్ ఎనిమిదో ప్యాకేజీకి నీటిని సరఫరా చేశామన్నారు. ఇక్కడి సర్జిపూల్ సముద్రమట్టానికి మొత్తం 228 మీటర్ల ఎత్తులో నిర్మించామ ని పేర్కొన్నారు. ప్రస్తుతం సర్జిపూల్‌లో సముద్రమట్టానికి 194 మీటర్ల ఎత్తులో నీటిని నింపినట్లు వివరించారు. శుక్రవారం మళ్లీ నందిమేడారం రి జర్వాయర్ నుంచి గేట్లను ఎత్తి నీటిని విడుదల చే స్తామన్నారు. సర్జిపూల్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం పెంచుతామని తెలిపారు. దీనిలో భాగంగా సాకేంతికపరమైన పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి సొరంగమార్గం ద్వారా వాహనాల్లో సర్వీస్‌బే చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. చివరిదశకు చేరుకున్న మోటార్ల నిర్మాణాన్ని అధికారులు ఎమ్మెల్యేకు చూపించారు. పూర్తైన పనులను చూసిన ఎమ్మెల్యే ఆనందం వ్యక్తంచేశారు.

మాజీ ఎంపీ వినోద్‌కు కృతజ్ఞతలు:ఎమ్మెల్యే
కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనంతరం గో దావరి నీరు మొట్టమొదలు చొప్పదండి నియోజకవర్గంలో ఉరకేలేసే భాగ్యం కల్పించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. నేడు వినోద్‌కుమార్ ఎనిమిదో ప్యాకేజీని సందర్శించనున్నారని తెలిపారు. మరికొన్ని రోజుల్లో వెట్న్ ప్రారంభించనుండగా మాజీ ఎంపీ లక్ష్మీపూర్‌కు రావడం ఆనందకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఈఈ నూనె శ్రీధర్, డీఈ గోపాలకృష్ణ, ఏఈఈలు సురేశ్‌కుమార్, రమేశ్ నాయక్, వెంకటేశ్‌నాయక్, మెగా ఏజన్సీ ప్రతినిధి సతీశ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జూపాక కరుణాకర్, నాయకులు గంట్ల వెంకటరెడ్డి, కలిగేటి లక్ష్మణ్, జవ్వాజి శేఖర్, రాజశేఖర్‌గౌడ్, కనుకయ్య, గునుకొండ అశోక్, సాతర్ల వివేకానంద, పూడూరి మల్లేశం, సత్యనారాయణరెడ్డి, బాపురెడ్డి, సైండ్ల కరుణాకర్, మినుకులు తిరుపతి, చిరుత అంజయ్య, పెంటి శంకర్, స్వామి, తదితరులు ఉన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles