సంక్షేమ పథకాల్లో తెలంగాణే ఆదర్శం

Fri,July 12, 2019 02:31 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ధర్మపురిలో పలు పార్టీలకు చెందిన నాయకులు మంత్రి ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా, గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలు క్రమశిక్షణతో మెదలాలని, ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను అ ర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడడం కార్యకర్తల బాధ్యత అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్‌కు సాధ్యం కాని అభివృద్ధిని నా లుగేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలకు ప్రజలకు నేరుగా అందాయనీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు. ముఖ్యం గా 24 గంటల విద్యుత్ అందించడంతో పాటు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడులకు ఎకరానికి రూ.10వేలు చెల్లించడంతో పాటు రైతులకు బీమా కల్పించి, కుటుంబాల్లో ధైర్యం నింపామన్నారు. అలాగే గురుకులాలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామనీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అలాగే తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి విపక్షాల నోరు మూయించామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజారంజక పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నా రు. ఇక్కడ ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles