అంతరించి పోతున్నం.. ఆదుకోండి

Thu,July 11, 2019 01:40 AM

జగిత్యాల రూరల్ / మల్యాల : అంతరించిపోతున్నాం ఆదుకోండి అంటూ బీసీ కమిషన్ స భ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌కు అరవకొమటి, గంజికుంటు కులస్థులు బుధవారం విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని పురాణీపేటలో అరవకొమటి కులస్థుల, కొండగట్టు దిగువన గంగికుం టు కులస్థుల జీవన స్థితిగతులను జేసీ బేతి రాజేశంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి కృష్ణమోహన్‌రావు తెలుసుకున్నారు. ముందుగా మల్యాల మండలం ముత్యంపేటకు అనుబంధంగా ఉన్న కొండగట్టు దిగువన గంజికుంటు కులస్థుల నివాసాలను పరిశీలించారు. తమ కులానికి ఎలాంటి ధ్రువీకరణ లేక విద్య, వైద్యం, ఆరోగ్యం, పలు సంక్షేమ పథకాల అమలులో నష్టపోతున్నామని గంజికుంటు కులస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చాకలి వారి వద్ద భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించే వారమనీ, మారిన పరిస్థితుల్లో రజకులకే కుల వృత్తి లేకపోగా తమకు సైతం ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. సమాజంలో గుర్తిం పు లేక ఎలాంటి విద్య, వైద్యం, కూలి పనుల్లో సై తం నష్టపోతున్నామన్నారు. ఇళ్లు కట్టుకొనే స్థోమ త లేక గుడిసెలు, డేరాల్లోనే బతుకులు వెల్లదీస్తున్నామని తెలిపారు.

కొండగట్టు దిగువన 19 కు టుంబాలు నివసిస్తున్నాయనీ, తాము ఇక్కడే పు ట్టి, పెరిగామనీ, అయినా తమకు స్థిర నివాసాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీఏ జాబితాలో తమను చేర్చి సర్టిఫికెట్లు జారీ చేయాలని విన్నవించారు. 19కుటుంబాల్లో పసులేటి అంజలి, పసులేటి మదన్ తల్లిదండ్రులు చనిపోగా వారి అమ్మ మ్మ పోషవ్వ ఆలనాపాలనా చూసుకుంటున్నదనీ, గురుకుల పాఠశాలల్లో సీటు పొందేందుకు ప్రయత్నించినా కులం సర్టిఫికెట్ లేక ఎక్కడా చేర్చుకోవడం లేదని తెలిపారు. అనంతరం వకుళాభరణం మాట్లాడుతూ డీసీడబ్ల్యువో రాజలింగంకు కొండగట్టులో ఉంటున్న గంజికుంటు కులస్థుల ఇండ్ల వారీగా సమాచారం, ప్రతి కుటుంబంలోని సభ్యు ల సంఖ్య, వారి ఆధార్ కార్డు ల జిరాక్సు ప్రతులు సేకరించి, తమ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. గంజికుంటు కులస్థుల సమస్యలనీ విన్నాననీ, ప్రభుత్వానికి నివేదిక అందించి న్యా యం జరిగేలా చొరవ చూపుతామన్నారు.

పెట్రోల్ బంకులు, బట్టల షాపుల్లో పనిచేస్తున్నాం..
జిల్లా కేంద్రంలోని పురాణీపేటలో ఉంటున్న అరవకొమటి కులస్థులు బీసీ కమిషన్ సభ్యుడి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. బతుకుదెరువు కోసం పెట్రోల్ బంక్‌లు, బట్టల షాపుల్లో తమ కులస్థులు పనిచేస్తున్నారనీ, జగిత్యాల పట్టణంలో దాదాపు వంద కుటుంబాలుండగా 300 జనాభా ఉందనీ, జగిత్యాల, రాయికల్ మండలం కట్కాపూర్, కుమ్మరిపెల్లి, సారంగాపూర్ మండ లం పెంబట్ల, కోనాపూర్‌లో తమ కులస్థులు ఉ న్నారని తెలిపారు. వకుళాభరణం వెంట జేసీ బేతి రాజేశంర్, కలెక్టర్ ఏవో నలువాల వెంకటేశ్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజలింగం, మల్యా ల తహసీల్దార్ శ్రీనివాస రావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు సుధీర్ కుమార్, కిరణ్ కు మార్, గాజుల నాగరాజు తదితరులున్నారు.

ఎనోటి కులస్థుల స్థితిగతుల పరిశీలన
కోరుట్ల : కోరుట్ల మండలం పైడిమడుగులో ఎనోటి కులస్థుల స్థితిగతులను కూడా వకుళాభరణం పరిశీలించారు. గ్రామంలో 20 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వివరించారు. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు, తహసీల్దార్ కోమల్‌రెడ్డి, సర్పంచ్ దమ్మ భీమ్‌రెడ్డి, ఎంపీటీసీ గడికొప్పుల మాధురి, గోపాల్, ఆరె శేఖర్, వీఆర్వో నవీన్, అయిలినేని జగన్‌మోహన్‌రావు, భిక్షపతి, రాజలింగం ఉన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles