కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Thu,July 11, 2019 01:40 AM

జగిత్యాల రూరల్ : కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి రూప్‌సింగ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో టీఆర్‌ఎస్ కా ర్మిక విభాగం, హమాలీ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సభ్యత్వ నమోదు పూర్తి చేసి ఆ పుస్తకాలను అం దజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభు త్వం సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారనీ, కార్మికలు కోసం ప్రమాద బీమా, సాధారణ బీమా, శా శ్వత అం గ వైకల్యమైన వారికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు దావ సురేష్, టీఆర్‌ఎస్ కార్మిక విభా గం జిల్లా అధ్యక్షుడు కొంగర ప వన్ బాబు, హమాలీ సంఘం అధ్యక్షుడు సంబు కొమురయ్య, లక్ష్మణ్, పిట్ట ధర్మరాజు, ఎక్కల్దేవి రాజన్న యాదవ్, వొల్లం మల్లేశం పాల్గొన్నారు.

కొండాపూర్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం
కొడిమ్యాల: మండలంలోని కొండాపూర్‌లో టీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్ అధ్వర్యంలో బుధవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వ నమో దు చేయించుకున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు పులి వేంకటేశం గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పర్లపెల్లి ప్రభుదాస్ అధ్వర్యంలో పార్టీ సభ్య త్వ నమోదు కార్య క్రమాన్ని చేపట్టారు. కొడిమ్యాల గ్రామ పం చాయతీ కార్యాల యంలోని 1 వార్డులో టీఆర్‌ఎస్ నాయకులు గడ్డం లకా్ష్మరెడ్డి అధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ నసీరొద్దీన్, సర్పంచ్ సామంతుల ప్రభాకర్, ఉప సర్పంచ్ కొలపూరం రమేశ్, గుండు రాజుకుమార్, తదిత రులు ఉన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles