సభ్వత్వ పండుగ

Wed,July 10, 2019 02:31 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ఉమ్మడి జిల్లాలో అనూహ్య స్పందన వస్తున్నది. కార్యక్రమం ఎక్కడ చేపట్టినా పండుగలా కొనసాగుతున్నది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ముఖ్యనాయకులు తమ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. మంగళవారం ఆయాచోట్ల పాల్గొని, సభ్యత్వాలు స్తూ ఉత్సాహం నింపుతున్నారు. కార్యకర్తలు కూడా గడపగడపకూ తిరుగుతూ, సభ్యత్వాలు చేయిస్తున్నారు. మహిళలు, యువతీయువకులు కూడా స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు.

కరీంనగర్ : నగరంలోని 23వ డివిజన్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి సభ్యత్వాలు తీసుకున్నారు. అలాగే హుజూరాబాద్ పట్టణంలో చేపట్టిన ఇంటింటికీ టీఆర్‌ఎస్ పేరుతో చేపట్టిన సభ్యత్వ నమోదులో నియోజకవర్గ ఇన్‌చార్జి బస్వరాజ్ సారయ్య పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు ఇక్కడ ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు చేశారు. ఇక చిగురుమామిడి మండలంలో ఎంపీపీ కొత్త వినీత పాల్గొన్నారు. ఇల్లందకుంట, వీణవంక, రామడుగు, గన్నేరువరం మండలాల్లో కూడా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు ముమ్మరంగా చేపట్టారు.
జగిత్యాల : కొడిమ్యాల, మల్యాల మండల కేంద్రాల్లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి పలువురికి సభ్యత్వాలు ఇచ్చారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పండుగలా సాగుతున్నదని చెప్పారు. ఒక్క మల్యాల మండల కేంద్రంలోనే సుమారు 10వేల సభ్యత్వాలు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామనీ, ఇందుకు గానూ యువతతో ముందుగా సభ్యత్వ నమోదు చేయించాలని స్థానిక నేతలకు సూచించారు. మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులకు స్వయంగా సభ్యత్వ నమోదు రసీదులను అందచేశారు.
పెద్దపల్లి : మంథని, రామగుండం సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి కర్ర శ్రీహరి రామగిరి, ముత్తారం మం డలాల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. సెంటినరీకాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, సభ్యత్వాలు ఇచ్చారు. అలాగే ముత్తారం మండలం పోతారంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ సభ్యత్వాలు అందజేశారు. ఇక ఆయా మండలాల్లో నాయకులు ఉత్సాహంగా ముందుకుకదులుతున్నారు.

రాజన్న సిరిసిల్ల : పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాయకులు లక్ష్య సాధన దిశగా ముందుకెళ్తున్నారు. గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కోనరావుపేట మండల కేంద్రంలో జడ్పీ అధ్యక్షురాలు న్యాల కొండ అరుణ, ఇల్లంతకుంట మండలంలో జడ్పీ ఉపాధ్యక్షుడు సిద్దం వేణు సభ్యత్వాలు ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్‌రావు, గుండం నర్సయ్య, సిరిసిల్ల పట్టణంలో టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి మండల కేంద్రంలో చిక్కాల రామారావు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles