మున్సిపోల్స్‌కు కసరత్తు


Tue,July 9, 2019 01:20 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పుర పోరుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఎన్నికల అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. వివిధ అంశాల వారీగా పనులను బేరీ జు వేసుకున్న అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లితోపాటు నూతనంగా ఏర్పడిన ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో అధికారులు జనగణన చేపట్టారు. వీటితో పాటు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు బీసీ గణన కూడా చేపట్టారు. అలాగే వార్డుల విభజన నేపథ్యంలో జిల్లాలోని 5 మున్సిపాలిటీల నుం చి 74 ఫిర్యాదులు కూడా అధికారులకు అందాయి. అయితే విచారణ పూర్తి చేసి ఈనెల 10న ఓటర్ల జాబి తా ముసాయిదా ప్రకటించనున్నారు. 11న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. 12న ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ ఉండనున్నది. 13న మున్సిపాలిటి పరిధిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి 14వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.


ఈ నెలలోనే ఎన్నికలు పూర్తి..
ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్‌తోపాటు పోలింగ్ కూడా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. సోమవారం హైదరాబాద్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ఇదే విషయం ప్రకటించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నెల 15 లేక 16 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశమున్నది. ఈ నెల 30, 31 తేదీల్లో పోలింగ్ చేపట్టి, వచ్చే నెల తొ లి వారంలోనే పాలకవర్గాలు కొలువుదీరే విధంగా దృష్టి పెడుతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను కూడా పెంచుతున్నట్లు సమాచారం. మునిసిపాలిటీల వార్డుల్లో ఒక్కో అభ్యర్థికి 2 లక్షల వ్యయం చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తున్నది. దీంతోపాటు ఈ నెల 10 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటరు తుది జాబితాలు వెలువడనున్నాయి. వీటి ఆధారంగా అదే రోజు ప్రభుత్వం రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తుందని సమాచారం. ఆ తర్వాతే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

15, 16 తేదీల్లో నోటిఫికేషన్
14న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన తర్వా త 15 లేక 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, మున్సిపాలిటీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీ, శాంతి భద్రతలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. త్వరలో మున్సిపల్ శాఖ రిజర్వేషన్లు ఖరా రు చేయనున్న నేపథ్యంలో ఈ నెల 14 తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఆగస్టులోగా పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తున్న కారణంగా బ్యాలెట్ విధానాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఇప్పటికే ఆదేశించింది.

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు..
త్వరలో నిర్వహించబోయే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఏర్పాట్లలో భాగంగా అధికారులు పోలింగ్ మెటీరియల్‌ను సమకూర్చుకోవడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్ కేంద్రా లు, కౌంటింగ్ సెంటర్ల గుర్తించారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలింగ్ తేదీ ఎప్పు డు ప్రకటించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.

వార్డుల విభజనపై 74 ఫిర్యాదులు.. ధర్మపురి నుంచి నిల్..
జిల్లాలో మున్సిపల్ వార్డుల విభజనపై జిల్లా వ్యాప్తంగా 74 పిర్యాదులు వచ్చాయి. మున్సిపల్ వార్డుల విభజన కోసం ఈ నెల 2న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి, విభజన పై అభ్యంతరాలకు నాలుగు రోజులు గడువునిచ్చారు. ఈ నాలుగురోజుల్లో 74 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఇందులో జగిత్యాల నుంచి 38 ఫిర్యాదులు రాగా కోరుట్ల 13, మెట్‌పల్లి 21, రాయికల్ నుంచి 2 ఫిర్యాదులు రాగా ధర్మపురి నుంచి ఒక్కటి కూడా లేదు..

ప్రత్యేక అధికారుల నియామకం..
2014లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలతో ఏర్పాటైన పాలకవర్గం పదవీకాలం ఈ నెల 2తో ముగిసింది. దీంతో పురపాలనలో ఎలాంటి ఇబ్బందులు లే కుండా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కేటాయించింది. నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మపురి, రాయికల్ ము న్సిపాలిటీల్లో తాసిల్దార్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో 1,98,538 ఓటర్లు..
ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళ ఓటర్ల సంఖ్యను గుర్తించారు. జూన్ 21 నుంచే ఈ గణన చేపట్టిన ఎన్నికల అధికారులు మున్సిపాలిటీల వారీగా ఓటర్ల సంఖ్యను ప్రకటించారు. ప్రస్తుతం ప్రకటించిన లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 1,98,538 మంది ఓటర్లున్నట్లు గుర్తించారు. ఇందు లో 1,01,233 మంది మహిళలుండగా, 97,305 మంది పురుషులు ఉన్నారు. పరుషులకంటే మహిళలే ఈ ఐదు మున్సిపాలిటీల్లో అధికంగా ఉన్నారు. అలాగే జిల్లాలో 1,58,081 బీసీ ఓటర్లుండగా..16,539 ఎస్సీ ఓటర్లు, 2056 మంది ఎస్టీ ఓటర్లున్నట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే ఓసీ ఓటర్లు 21,862 మంది ఉన్నట్లు నిర్ధారించారు..ఇందులో గ్రేడ్-1 మున్సిపాలిటీ జగిత్యాలలో 80,193 మంది ఓటర్లు, గ్రేడ్-2 కోరుట్ల మున్సిపాలిటీలో 53,885 మంది ఓటర్లు, గ్రేడ్-3 మున్సిపాలిటీ మెట్‌పల్లిలో 40,451 మంది ఓటరున్నట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే కొత్తగా ఏర్పడ్డ ధర్మపురి మున్సిపాలిటి పరిధిలో 12,344 మంది ఓటర్లు, రాయికల్‌లో 11,665 మంది ఓటర్లున్నట్లు గుర్తించారు.

పెరిగిన మున్సిపల్ వార్డుల సంఖ్య..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేస్తున్నందున జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్య పెంచారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్ పరిధిలో 111 వార్డులుండగా.. ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా 134 వార్డులను ఏర్పాటు చేశారు. జగిత్యాల బల్దియాలో 38వార్డులుండగా 48కి పెంచారు. కోరుట్లలో 31నుంచి 33కు పెంచారు. మెట్‌పల్లిలో 24 నుంచి 26కు పెంచారు. ధర్మపురిలో 9 వార్డులకు గాను 15కు పెంచారు. రాయికల్‌లో 9కి 12కు పెంచారు.

పారదర్శకంగా వార్డుల విభజన
ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మపురి మున్సిపాలిటీలో వార్డుల విభజనను పారదర్శకంగా చేపట్టాం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 800మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అయితే పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
- వెంకట్‌రెడ్డి, కమిషనర్, ధర్మపురి

90

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles