సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

Tue,July 9, 2019 01:18 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ: సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఎ భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 102 మంది వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. సమస్యలను అధికారులకు వివరించి పరిష్కరించాలని కోరారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం అర్బన్‌లో 36, రూరల్ నుంచి 11దరఖాస్తులు వచ్చాయి. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డయల్ యువర్ కలెక్టర్..
జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో జేసీ బి.రాజేశం ఆధ్వర్యంలో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12మంది ఫోన్ ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాఅధికారులు పాల్గొన్నారు.

అభివృధ్ధిలో అగ్రస్థానంలో నిలపాలి
మేడిపల్లి: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మేడిపల్లి మండలాన్ని అభివృధ్ధిలో అగ్రస్థానంలో నిలపాలని జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జలశక్తి అభియాన్ సమీక్ష సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్పీ ఉపాధ్యక్షుడు హరిచరణ్‌రావు, ఎంపీపీ ఉమాదేవి, వైస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్‌ను పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సమావేశంలో ఏపీడీ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో రవీందర్, ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles