నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Tue,July 9, 2019 01:18 AM

కోరుట్లటౌన్: పట్టణంలో విద్యుత్ వార్షిక మరమ్మతు పనుల నేపథ్యంలో మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ పిప్పోజి రవి ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఇందిరారోడ్డు, ఎల్‌ఐసీ కాలనీ, రథాల పంపు, శ్రీనివాసరోడ్డు, బాలాజీ స్వీట్ హౌస్ రోడ్డు, కటికె వాడ, సుభాష్‌నగర్, పటేల్ రోడ్డు, జబ్బార్‌రోడ్డు, కూరగాయల మార్కెట్, గడి గురుజు, గంగంపేట, బెండపల్లి, ఉర్దూ మీడియం స్కూల్, జాకీర్‌రోడ్డు, తాళ్ల చెరువు కింద, అర్ఫత్ పురా, కోనేరు, కాల్వగడ్డ తదితర ప్రాంతాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles