సంపూర్ణ పారిశుధ్యం సాధించాలి

Tue,July 9, 2019 01:17 AM

మెట్‌పల్లి రూరల్: సంపూర్ణ పారిశుధ్యంపై గ్రామస్థులకు అవగాహన కల్పించీ, సాధనకు కృషి చే యాలని ఈఓఆర్డీ స్వరూపారాణి ఆదేశించారు. మెట్‌పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, ఐకేపీ సిబ్బందికి హరితహారం, సంపూర్ణ పారిశుధ్యంపై సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇం కుడు గుంత, మరుగుదొడ్డి లేని ప్రతి ఇంటికి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న వారు సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డు లేని గ్రామంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసి వెంటనే నిర్మించాలని వివరించారు. ప్రతి మంగళవారం గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, గ్రామస్థాయి అధికారులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సర్పంచ్ అధ్యక్షతన స్వచ్ఛ హరిత మిషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఐదో విడత హరితహారం విజయవంతం చేయానికి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ప్రతి గ్రామానికి 40 వేలకు తగ్గకుండా మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేం ద్రాలు, పీహెచ్‌ఎసీలు, మార్కెట్లు, దేవాలయాల ఆవరణ, రోడ్డు పక్కన, పొలం గట్లు, చెరువు కట్టలపై మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ రాజశ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం విమోచన, స్వచ్ఛభారత్ కో-ఆర్డినేటర్ మనీల పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles