జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు

Tue,July 9, 2019 01:17 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట గ్రామంలో సోమవారం టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సహకార సంఘం అధ్యక్షుడు అల్లూరు రఘుపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100మంది కార్యకర్తలకు క్రియాశీల, సాధారణ సభ్యత్వాలు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అవినాశ్, పార్టీ నాయకులు చేగొండ శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేట గ్రామంలో వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీలోపు మండల వ్యాప్తంగా 10 వేల సాధారణ, క్రియాశీల సభ్యత్వాలను నమోదు చేయాలని కార్యకర్తలకు నాగేశ్ సూచించారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తక్కళ్ల నరేశ్‌రెడ్డి, సుద్దాల నడ్పిగంగారం, దౌడె గంగనర్సయ్య, గంగారం, బొల్లం రఘు తదితరులున్నారు.
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు వాడవాడలా తిరిగి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సభ్యత్వం తీసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం మండలాధ్యక్షుడు గడ్డం భూమరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కొండ ఆంజనేయులు, నాయకులు కొత్తపెల్లి శ్రీనివాస్, పూండ్ర జనార్దన్‌రెడ్డి, బద్దం మహేందర్, ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, గట్టయ్య, గంగారెడ్డి, అంబల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి రూరల్: మండలంలోని వెల్లుల్ల గ్రామంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు గొల్లమాడ శానయ్య, జుంగుల మారుతిగౌడ్, పాక నర్సయ్య, ప్రహ్లాద రాజేంద్రప్రసాద్, జంబుక రాజయ్య, అనిరెడ్డి రాజు, రాజుగౌడ్, సతీశ్, క్యాతం రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల: మండలంలోని వెంకటాపూర్‌లో ఎంపీపీ తోట నారాయణ ఆధ్వర్యంలో, ధర్మారంలో ఎంపీటీసీ సభ్యుడు నాగిరెడ్డి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టారు. సర్పంచ్ తోట శారద, రైతు సమన్వయ సమితి సభ్యులు లింగారెడ్డి, ముత్తారెడ్డి, రాజరెడ్డి సాగర్, చందు, ఖలీల్, విజయ్, ప్రకాశ్, సురేశ్ తదితరులున్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles