పాఠశాలల్లో మాక్ పోలింగ్ సందడి

Sun,July 7, 2019 12:59 AM

కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం పద్మనగర్‌లోని పారమిత పాఠశాలలో మాక్ ఎన్నికల సందడి నెలకొంది. శనివారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఓటింగ్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ తాసిల్దార్ గుగ్గిళ్ల రమేశ్, పద్మనగర్ ఎంపీటీసీ గుంజేటి శివకుమార్, 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ఓటు హక్కు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న పారమిత పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్, స్పోర్ట్స్ కెప్టెన్, సీసీఏ కెప్టెన్, అసెంబ్లీ కెప్టెన్ల పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులే ప్రిసైడింగ్ అధికారులుగా, పోలింగ్ అధికారులుగా, రిటర్నింగ్ అధికారులుగా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు పారమిత పాఠశాల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్‌రావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వినోద్‌రావు, ప్రసూన అనుకర్‌రావు, రశ్మిత, వీయూఎం ప్రసాద్, ప్రిన్సిపాల్ గోపికృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ రభింద్ర పాత్రో, సీసీఏ సమన్వయ కర్త ఎండీ యూసఫ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అల్ఫోర్స్ హైస్కూల్‌లో ...
రామడుగు: మండలంలోని గోపాల్‌రావుపేట అల్ఫోర్స్ హైస్కూల్లో శనివారం విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులకు ధృవ్, లక్ష్య, సరాస్, తేజాస్ పేరిట నాలుగు హౌస్‌లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించారు. 11మంది కెప్టెన్లు, 11మంది వైస్ కెప్టెన్లు పోటీల్లో నిలిచారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే పోటీల్లో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించగా రెండు రోజుల ముందునుంచి ప్రచారం నిర్వహించారు. నాలుగు బూత్‌ల్లో విద్యార్థులు బారులు తీరి బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు ముందస్తుగా గుర్తింపు కార్డులను కూడా జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles