అట్టహాసంగా స్వీకారోత్సవం

Fri,July 5, 2019 03:21 AM

మండల ప్రజా పరిషత్తుల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గురువారం ప్రమాణ స్వీకారోత్సవాలు అట్టహాసంగా సాగాయి. 18 మండలాల్లో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ మెంబర్లతో పండుగ వాతావరణంలో ప్రత్యేకాధికారులు ప్రమాణాలు చేయించారు. ధర్మపురి, పెగడపల్లి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, రాయికల్ సారంగాపూర్ మండలాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని పాలకవర్గ సభ్యులను అభినందించగా, అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
- జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి, నమస్తే తెలంగాణ

ఆదర్శంగా నిలుపుతా
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శం నిలుపుతా. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. మండల పరిషత్ పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామాల్లో వైద్యం, విద్య, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సమస్యలు పరిష్కరిస్తా. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తా.
- తోట నారాయణ, ఎంపీపీ, కోరుట్ల

మరోసారి సేవ చేసే భాగ్యం
కొడిమ్యాల మండల ప్రజలకు మరోసారి సేవచేసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పిం చిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు రుణపడి ఉంటా. కొడిమ్యాల ఎంపీపీగా అవకాశం కల్పించడంతో ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చేశా. మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటా.
- మేన్నేని స్వర్ణలత, ఎంపీపీ, కొడిమ్యాల

సేవ చేసే అదృష్టం
ప్రజలకు సేవచేసే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎంపీపీనవుతానని అనుకోలేదు. ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రి ఈశ్వర్, మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు. మంత్రి ఈశ్వర్ సహకారంతో మండలానికి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా. నన్ను గెలిపించిన చర్లపల్లి, జగదేవ్‌పేట గ్రామాల ప్రజలకు రుణపడి ఉంటా.
-కునమల్ల లక్ష్మి, ఎంపీపీ, వెల్గటూరు

అభివృద్ధి చేస్తా
మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారం తో ధర్మపురి మండ లాన్ని మరింత అభి వృద్ధి చేస్తా. రిజర్వే షన్ అనుకూలించి మంత్రి ప్రోత్సాహం, సహకారంతో ఎంపీపీ పదవి చేపట్టా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. నన్ను ఆదరించిన మంత్రికి, బుద్దేశ్‌పల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా.
- ఎడ్ల చిట్టిబాబు,ఎంపీపీ, ధర్మపురి

నంబర్‌వన్‌లా నిలుపుతా
గొల్లపల్లి మండ లాన్ని జగిత్యాల జిల్లాలో నంబర్ వన్‌లా నిలుపుతా. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల సహకారం తో అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటా. మండల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా.
- నక్క శంకరయ్య, ఎంపీపీ, గొల్లపల్లి

అగ్రగామిగా నిలుపుతా
ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సహకారంతో మం డలాన్ని అభి వృద్ధి చేస్తా. ఎంపీటీసీ సభ్యులు, సర్పం చుల సహకారంతో గ్రామాల్లో సమస్యలను పరిష్కస్తా. ఆరపేట నుంచి కొండ్రికర్ల మీదుగా జగ్గసాగర్ వరకు బీటీ రోడ్డు వేయి స్తా. వెల్లుల్ల మర్రి నుంచి ఆత్మ కూర్ రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి మార్చేలా ప్రయత్నిస్తా. కొండ్రికర్ల వాగుపై వంతెన, లింకురోడ్ల నిర్మా ణం కోసం కృషి చేస్తా.
- మారు సాయిరెడ్డి, ఎంపీపీ, మెట్‌పల్లి

ఎమ్మెల్యే సహకారంతో..
ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తా. గ్రామీణ ప్రాంతా ల్లో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల సమష్టి సహకారంతో పరిష్కారించేందుకు కృషి చేస్తా. నాపై నమ్మకంతో అప్పజెప్పిన పదవిని సక్రమంగా నిర్వహిస్తూ పార్టీకి ప్రజలకు జవాబుదారీగా ఉంటా.
-జాజాల భీమేశ్వరి, ఎంపీపీ, ఇబ్రహీంపట్నం

ఆదర్శంగా తీర్చిదిద్దుతా
మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకా రంతో పెగడపల్లిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా. మండలంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తా. సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకూ అందేలా పారదర్శకంగా పని చేస్తా. పార్టీలకతీతంగా పాలకవర్గ సభ్యులతో కలిసి కట్టుగా మండల అభివృద్ధిలో భాగస్వామినవుతా.
-గోళి శోభ, ఎంపీపీ, పెగడపల్లి

మరింత అభివృద్ధి
ఎమ్మెల్యే కల్వకుంట్ల సహకారంతో మం డలాన్ని అన్ని రం గాల్లో మరింత అభి వృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామాల్లో సమస్య లను సంబంధిత గ్రామ ప్రజాప్రతి నిధులు, అధికారుల సూచనలు, సలహాలతో పరిష్కారానికి కృషి చేసి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపేలా పనిచేస్తా. సమస్యలు త్వరిగతిన పరిష్కారమ య్యేలా చర్యలు తీసుకుంటా.
- కాటిపల్లి సరోజన, ఎంపీపీ, మల్లాపూర్

సమన్వయంతో ముందుకు
ఎమ్మెల్యే సంజయ్ సహకారంతో జగిత్యాల మండ లాన్ని మరింత అభివృద్ధి చేస్తా. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల సహకారంతో గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తా. అర్హులం దరికీ సంక్షేమ పథకాలు అందిస్తా. ఎంపీటీసీ సభ్యులు, అధికారులను సమన్వయంతో చేసుకుంటూ సమష్టి సహకారంతో ముందుకు పోతా.
- గాజర్ల గంగారాం, ఎంపీపీ, జగిత్యాల రూరల్

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles