సమష్టిగా పని చేస్తేనే అభివృద్ధి

Thu,July 4, 2019 04:39 AM

కథలాపూర్: ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. మండలకేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాన్ని, రూ.కోటితో నిర్మించిన మండల పరిషత్ నూతన భవనాన్ని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. మండలంలోని మత్స్య కార్మికులకు 75శాతం సబ్సిడీపై మంజూరైన టాటా ఏస్ వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం పదవీకాలం పూర్తి చేసుకున్న మండల పరిషత్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడారు. రైతులకు భూముల విషయంలో ఇబ్బందులుండవద్దని రెవెన్యూశాఖలో కొత్త చట్టాలు తీసుకువస్తున్నామనీ, త్వరలోనే వాటి ఫలాలు అందుతాయన్నారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా చట్టాలు తీసుకొస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. వరుస ఎన్నికలతో ఎన్నికల కోడ్ రావడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందనీ, ఇక నుంచి ఐదేళ్లపాటు అభివృద్ధి పనులు వేగవంతమవుతాయన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలనీ, వారికి అండగా ఉంటామన్నారు.

ఇన్నాళ్లు ఎంపీటీసీ సభ్యులుగా సేవలందించినవారు ఇక నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. మండలంలోని ఎంపీటీసీలు ఎమ్మెల్యే రమేశ్‌బాబును, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లోక భువనేశ్వరి, కొత్త జడ్పీటీసీ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, కొత్త ఎంపీపీ జవ్వాజి రేవతి, తాసిల్దార్ ఎండీ యూసుఫ్, డీఈ రాజమల్లయ్య, ఎంపీడీవో కట్కం ప్రభు, ఎంఈవో ఆనందరావు, ఏఈలు సీవీ ప్రసాద్, చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ నాంపెల్లి లింబాద్రి, నాయకులు వర్ధినేని నాగేశ్వర్‌రావు, గడ్డం భూమారెడ్డి, కల్లెడ శంకర్, లోక శశిధర్‌రెడ్డి, జవ్వాజి గణేశ్, గండ్ర కిరణ్‌రావు, ఎండీ రఫీ, ఎండీ అజీమ్, దొప్పల జలేందర్, ఎంజీ రెడ్డి, గోపు శ్రీనివాస్, కంటె నీరజ, మామిడిపెల్లి రవి, గసికంటి లత, శ్రీరాముల ప్రకాశ్, వేముల గంగరాజం, చీటి విద్యాసాగర్‌రావు, కొండ ఆంజనేయులు, మల్యాల రమేశ్, మేడిపెల్లి ఆదిరెడ్డి, పానుగంటి విజయలక్ష్మి, భూమగంగారాం, పోతు శేఖర్, గంగాధర్, నస్కూరి భాస్కర్, సోమ దేవేందర్‌రెడ్డి, ముంజ నవీన్, ముదాం రవి, చిట్కూరి మహేశ్, చుక్క దేవారాజం, కిషన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles