ప్రజా సంక్షేమానికి పెద్దపీట

Thu,July 4, 2019 04:39 AM

వెల్గటూరు: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండ లంలోని కుమ్మరిపల్లిలో కస్తూర్బా పాఠశాల ఆవరణలో కళాశాల భవన నిర్మాణానికి, అనంతరం వెల్గటూరు జడ్పీ పాఠశాల ఆవరణలో నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిర్మించిన సభా వేదికను ప్రారంభించారు. పాతగూడూరులో చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.జడ్పీ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి, పాతగూడూరు నుంచి నల్లలింగయ్యపల్లి వరకు సీసీ రోడ్డుకు, గ్రామ శివారులోని పెద్ద వాగువద్ద చెక్‌డ్యాం, గ్రామ పంచాయతీ భవనం, కాపు సంఘ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. విద్యుత్ సభ్‌స్టేషన్, లోలెవల్ వంతెనను ప్రారంభించారు. రాజారాంపల్లిలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందిచేలా కస్తూర్బా పాఠశాలలు దోహద పడుతున్నాయని తెలిపారు. కస్తూర్బాల్లో ఇంటర్ ప్రవేశపెట్టడం ద్వారా పేద విద్యార్థులకు ఊరట లభించిందన్నారు. పెద్ద వాగుపై లోలెవల్ వంతెనను రూ.2కోట్ల 87 లక్షలతో నిర్మించడంతో పాటు నీటిని ఒడిసి పట్టేందుకు రూ.25లక్షలతో చెక్ డ్యాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాతగూడూరు పరిధిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, వివేకనందుడు ఆదర్శ మూర్తులనీ, యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గొడిసెలపేటకు చెందిన ఒడిగె మహేశ్ విద్యుదాఘాతానికి గురై ఏడాది క్రితం మృతి చెందగా అతడి కుటంబానికి రూ.5లక్షల చెక్కును మంత్రి ఈశ్వర్ పాతగూడూరులో అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, జడ్పీటీసీ బీ సుధారాణి, సర్పంచ్‌లు కొప్పుల విద్యాసాగర్, మేరుగు మురళీ గౌడ్, గెల్లు శేఖర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మూగల సత్యం, ఎంఈఓ బత్తుల భూమయ్య, ఎంపీడీవో సంజీవరావు, పాఠశాల ప్రత్యేకాధికారి కిరణ్ జ్యోతి, నాయకులు ఎలుక రాజు, పత్తిపాక వెంకటేశ్, గాజుల సతీశ్, పదిరె నారాయణరావు, చల్లూరి రాంచం దర్, జక్కుల రామయ్య, బోడకుంటి రమేశ్, ఎలేటి కృష్ణారెడ్డి, మారం జలెందర్‌రెడ్డి, గాగిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, లక్కాకుల శ్రీనివాస్, లింగయ్య, జూపాక కుమార్, రామిల్ల సనీల్, ఎండీ రియాజ్, కొప్పుల సురేశ్, గంట్యాల రాజేందర్ పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles