ఉద్యమంలా సభ్యత్వ నమోదు

Wed,July 3, 2019 03:09 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ధర్మపురి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం కనుల పండువలా కొనసాగుతుండగా, ప్రజల నుంచి మంచి స్పం దన వస్తున్నది. మంగళవారం ధర్మపురి పట్టణంలో గులాబీ నేతలు ఇంటింటికి తిరుగుతూ టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో, పట్టణాభివృద్ధిని వివరించి, సభ్యత్వాలు తీసుకున్నారు. మండలానికి పదివేల సభ్యత్వాలు లక్ష్యం, కాగా మంగళవారం వరకు మూడువేల వరకు పూర్తయినట్లు వైస్ ఎంపీపీ అయ్యోరి రా జేశ్‌కుమార్, నృసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీ కాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందారపు రామన్న, అనంతుల లక్ష్మణ్, స్తంబంకాడి మహేశ్, చుక్క భీమ్‌రాజ్, అప్పాల వసంత్, బండారి అశోక్, చల్ల రవి, మరియు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

లక్ష్యం చేరాలి : ఎంపీపీ సత్తయ్య
పెగడపల్లి : మండలంలో టీఆర్‌ఎస్ పదివేల సభ్యత్వాలు చేయించి, లక్ష్యం చేరాలని ఎంపీపీ కాశెట్టి సత్తయ్య అన్నా రు. మంగళవారం మండలంలోని లింగాపూర్ గ్రామంలో మండల పార్టీ నాయకులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరిస్తూ సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన మంచి స్పందన లభిస్తుందనీ, స్వచ్ఛందం గా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కీచులాటపల్లి, పెగడపల్లి, నందగిరి, ఐతుపల్లి, మద్దులపల్లి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, సభ్యత్వ నమోదు ఇన్‌చా ర్జి మాదారపు కరుణాకర్‌రావు, ఇరుగురాల ఆనందం, ఎండీ జానీ, గాజుల గంగాధర్, అన్నెమల్ల కాంతయ్య, సర్పంచు లు మేర్గు శ్రీనివాస్, రాచకొండ స్వప్న, జిట్టవేని కొండయ్య, ఎంపీటీసీలు పులి రాజేశం, గుర్రం స్వాతి, మాజీ సర్పంచ్ సుంకరి మమత, నాయకులు గండ్ర ప్రవీణ్‌రావు, బొమ్మెన చిన్నస్వామి, రాచకొండ ఆనందం, గుర్రం తిరుపతిరెడ్డి, పలుమారు విజయ్‌యాదవ్, గోళి సంజీవరెడ్డి, జేరిపోతుల శ్రీనివాస్, లింగయ్య, చిరంజీవినాయక్, భూమానాయక్, సంతోష్, రహీం, వెంకటరెడ్డి, పలుమారు మల్లేశ్‌యాదవ్, కడారి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి, కాశెట్టి వీరేశం, ఇరుగురాల అజయ్, ఈరి కనకయ్య పాల్గొన్నారు.

జోరుగా సభ్యత్వ నమోదు
వెల్గటూరు: సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు మండలంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడు రోజులుగా జోరుగా సాగుతుంది. మం గళవారం మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళవార 6,578 క్రియాశీల, సాధారణ సభ్యత్వాలను నమోదు చేసినట్లు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మూగల సత్యం తెలిపారు. జడ్పీటీసీ బి సుధారాణి, సర్పంచులు మారం జలందర్‌రెడ్డి, కొప్పుల విద్యాసాగర్, అనుమాల తిరుపతి, బోడకుంటి రమేశ్, గంగుల నగేశ్, యాగండ్ల తిరుపతి, గెల్లు శేఖర్, పొన్నం స్వరూప, బిటుకు పద్మ, రామిల్ల లావణ్య, గాగిరెడ్డి లింగమ్మ, ఎంపీటీసీలు పత్తిపాక వెంకటేశ్, చల్లూరి రాంచందర్, పోడేటి సత్తయ్య, గొల్లపల్లి, శ్రీజ, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక రా జు , నాయకులు గాజుల సతీశ్, పెద్దూరి భరత్, బి రామస్వామి, గంట్యాల రాజేందర్, మద్ది మురళీధర్, గొల్లపల్లి మల్లేశం, రామిల్ల సనీల్, పొన్నం తిరుపతి, వన్నెల నర్సింహరెడ్డి, మెతుకు స్వామి, రియాజ్, పొడేటి రవి, గోపు పోచ య్య, రాందేని కోటయ్య, రంగు భూమయ్య పాల్గొన్నారు.

గొల్లపల్లి : మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. మంగళవారం మండలంలోని మల్లన్నపేట, రాఘవటప్నం, వెనుగుమట్ల, బొంకూర్, లొత్తునూ ర్ గ్రామాల్లో సభ్యత్వ నమోదు కొనసాగింది. టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు గంగాధర్, గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర తిరుపతిగౌడ్, పుట్టపాక సత్తయ్య, రత్నయ్య, ఆకుల రాజు, సత్తయ్య, అంజయ్య పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles