బల్దియాల్లో ప్రత్యేక పాలనn నేటి నుంచే అమలు

Wed,July 3, 2019 03:05 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగనున్నది. మంగళవారం పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఆయా బల్దియాలకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో వార్డులు, కార్పొరేషన్‌లో డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో విభజన ప్రక్రియను రెండు రోజులు చేపట్టిన అధికారులు సోమవారం రాత్రి ము సాయిదా ప్రకటించారు. ఈ నెల 12 వరకు పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ప్రకటించనుండగా, అనంతరం ఎన్నికల నిర్వహణ చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రత్యేకాధికారుల పాలన కూడా తక్కువ కాలం మ్రాతమే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రత్యేకాధికారుల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిల్లో జగిత్యాల గ్రేడ్-1 మున్సిపాలిటీకి కలెక్టర్ శరత్‌ను, కోరుట్లకు జేసీ రాజేశంను, మెట్‌పల్లికి సబ్ కలెక్టర్ గౌతం పొత్రును నియమించారు. కొత్తగా ఏర్పాటైన ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలకు ఇప్పటికే ప్రత్యేకాధికారులు ఉన్నారు.

ఎన్నికల ఏర్పాట్లతోనే బిజీ
కాగా, బుధవారం నుంచి పట్టణాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతున్నా.. వీరు పూర్తిగా ఎ న్నికల ఏర్పాట్లలోనే బిజీగా మారనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 వరకు వివిధ అంశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. అలాగే ఈ నెల 14న రిజర్వేషన్లను కూడా ప్రకటించే అవకాశముందని తెలుస్తున్నది. తదనంతరం ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రత్యేకాధికారుల పాలనలో పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ చేపట్టే అవకాశాలున్నాయి.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles