ఆత్మ గౌరవ జాతరను విజయవంతం చేయాలి

Wed,July 3, 2019 03:05 AM

జగిత్యాల టవర్ సర్కిల్ : ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగల ఆత్మగౌరవ జాతరను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చెట్‌పెల్లి లక్ష్మణ్ కోరారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి సమీపంలో గల మాదిగ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఈ నెల 7న జరిగే మహాసభకు జిల్లాలో ని మాదిగ, మాదిగ ఉప కులాలు ప్రతి కుటుంబం నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమ గడ్డ అయిన ఈదుమూడి గ్రామంలో నిర్వహించే 25సంవత్సరాల సిల్వర్ జూబ్లి వేడుకలకు మాదిగ మేధావులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుమాల గంగారాం, మాజీ సర్పంచ్ నీలం నర్సయ్య, నాయకులు బోనగిరి కిషన్, సంగెపు ముత్యం, రేగుంట అంజ య్య, దుమాల పెద్ద గంగారాం, మంథెన అంజయ్య, బెజ్జంకి నగేష్; రమేశ్, బాలె గంగాధర్, చిట్యాల శేఖర్, చిర్ర మోహన్, కొత్త లక్ష్మణ్, రంజిత్, రాములు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles