కొండగట్టులో భక్తుల రద్దీ

Wed,July 3, 2019 03:04 AM

మల్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో రద్దీగా కనిపించింది. సోమవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు సాయంత్రానికి కొండగట్టుకు చేరి ఆలయ ఆవరణలో బస చే శారు. మంగళవారం వేకువ జాము నుంచే పాత, కొత్త కోనేరుల్లో స్నానాలు చేసి, క్యూలైన్లలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసి, క్యూలైన్లను క్రమబద్దీకరించారు. అలాగే భక్తులు వేంకటేశ్వర, లక్ష్మీ, బేతాళ స్వామి, కోదండ రామాలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. మునిగుహలు, కొండలరాయు ని అడుగులు, బొజ్జపోతన ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. ప్రాకార మండపంలో పలువురు భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అష్టోత్తర శతనామావళి పూజ, అభిషేకం, హారతి తదితర పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏఈవో బుద్ధి శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌శర్మ, అంజయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌రావు, సంపత్ ఉన్నారు.

అంజన్న నైవేద్యంలో కోత
కూరగాయల సరఫరా సాగకపోవడంతో ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారికి సమర్పించే నిత్య నైవేద్యంలో కోతలు తప్పడం లేదు. గత రెండు వారాల నుంచి కాంట్రాక్టర్ దిట్టానికి కూరగాయలు అందించడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అర్చకు లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక సొం త ఖర్చులతో నివేదన చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం స్వామి వారికి కదంబం సమర్పించాల్సి ఉండగా, సరుకులు, కూరగాయల సరఫరా లేక పొంగలినే నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు సౌకర్యాల మాట దేవుడెరుగు లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా.. స్వామి వారికి సమర్పించే నైవేద్యం నివేదనల్లో కోతలు విధించడమేంటని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని, నిత్యం సామగ్రి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles