పరిషత్ కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలి

Sat,May 25, 2019 01:26 AM

-లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లూ చేయాలి
- ఏజెంట్లు, సిబ్బందికి వేర్వేరుగా బారీకేడ్లతో కూడిన దారులుండాలి
- సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా కల్పించాలి
- కలెక్టర్ డాక్టర్ శరత్
- ఎస్‌కేఎన్‌ఆర్, కండ్లపెల్లి మోడల్ స్కూల్‌లో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
జగిత్యాల రూరల్ : ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలనీ, కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శరత్ సూచిం చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళా శాల, జగిత్యాల మండలం కండ్లపెల్లి మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ శరత్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్కిం గ్, స్ట్రాంగ్ రూము నుంచి కౌంటింగ్ హాల్ వరకు బ్యాలెట్ బాక్సులు తీసుకొని వచ్చేటప్పుడు సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో ఏజెంట్లు కలవకుండా బారీకేడ్లతో కూడిన దారులు వేర్వేరుగా ఉండాలన్నారు. పార్కింగ్ కు సైతం బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు చే యాలనీ, ఏవిధమైన సంఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వీడియో, సీసీటీవీలు ఏర్పా టు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో జరిగే కౌంటింగ్‌కు మొత్తం 5 కౌంటిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, బుగ్గారం, ధర్మపురి, జగిత్యాల (రూర ల్), జగిత్యాల (అర్బన్), మల్యాలకు సంబంధించిన కౌంటింగ్‌ను ఎస్‌కే ఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తా మనీ, కౌంటింగ్‌కు 63 ఎంపీటీసీలకు గానూ 14కౌంటింగ్ హాల్స్, 126 టే బుల్స్, 31మంది ఆర్‌వోలు, 126 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 252మంది కౌంటింగ్ సహాయకుల ను కేటాయించామన్నారు. గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాలకు గొల్లపల్లి మోడల్ స్కూల్‌లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశామని తెలిపారు.

40ఎంపీటీసీలకు గానూ 9హా ల్స్ కేటాయించామనీ, ఒక ఎంపీటీసీకి రెండు టే బుల్స్ చొప్పున 80టేబుల్స్, 19మంది ఆర్‌వోలు, 80మంది సూపర్‌వైజర్లు, 160మంది కౌంటింగ్ స హాయకులను ఏర్పాటు చేశామన్నారు. కథలాపూర్, మేడిపల్లి, కోరు ట్ల మండలాలకు సంబంధించి కోరుట్ల మోడల్ స్కూల్ లో కౌంటింగ్ ఏర్పాటు చేశామనీ, 36 ఎంపీటీసీలకు గానూ 6కౌంటింగ్ హాల్స్, ఒక ఎంపీటీసీకి రెండు టేబు ల్స్ చొప్పున 72టేబుల్స్, 18మంది ఆర్‌వోలు, 72 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 144మంది కౌంటిం గ్ సహాయకులను నియ మించామన్నారు. మల్లాపూ ర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పెల్లి మండలాలకు సంబం ధించి ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్‌లో కౌంటింగ్ ఏర్పాటు చేశామనీ, 40 ఎంపీటీసీలకు గానూ 6కౌంటింగ్ హాల్స్, ప్రతి ఎంపీటీ సీకి రెండు టేబుల్స్ చొప్పున 80టేబుల్స్, 20మంది ఆర్వోలు, 80మంది సూపర్‌వైజర్లు, 160మంది కౌం టింగ్ సహాయకులను నియమించామన్నారు. అలాగే రాయికల్, సారంగాపూర్, బీర్‌పూర్ మండలాలకు సం బంధించి జగిత్యాల మండలం కండ్లపెల్లి మోడల్ స్కూ ల్‌లో ఏర్పాటు చేశామనీ, 27ఎంపీటీసీలకు 4కౌంటిం గ్ హాల్స్‌ను ఏర్పాటు చేశామనీ, ఒక ఎంపీటీసీకి రెండు టేబుల్స్ చొప్పున 54టేబుల్స్, 14మంది ఆర్వోలను, 54మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లను, 108మంది కౌంటింగ్ సహాయకులను నియమించామని తెలి పారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్త యిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నరేందర్, డీఎస్పీ వెంకటరమణ, డీపీవో శ్రీలతా రెడ్డి, జిల్లా లైజనింగ్ అధికారి మదన్‌మోహన్, ఎంపీడీ వోలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles