ఐదో విడతకు రెడీ

Sat,May 25, 2019 01:25 AM

-ధర్మపురి, బుగ్గారం మండలాల్లో 36 నర్సరీలు
-24లక్షల మొక్కల పెంపకం
-వచ్చే నెలలో నాటేందుకు ఏర్పాట్లు
ధర్మపురి, నమస్తే తెలంగాణ : అటవీ విస్తీర్ణానికి, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి నాలుగేళ్ల నుంచి విజయవంతం నిర్వహిస్తున్నది. హరితహారం ఐదోవిడత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రస్తుతం ప్రతీ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని ప్రారంభించింది. ఒక్కో నర్సరీలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖ సహకారంతో దాదాపు 50వేల నుంచి లక్ష వరకు మొక్కలను పెంచుతున్నారు. ధర్మపురి, బుగ్గారం మండలాల్లో మొత్తం 36 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఉపాధిహామీ కింద డీఆర్డీఓ ఆధ్వర్యంలో 29 నర్సరీలు, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడు నర్సరీలుండగా, వీటి ద్వారా ఈ ఏడాది 24లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ 18లక్షలు, అటవీశాఖకు ఆరు లక్షల మొక్కలు పెంచుతున్నది, వచ్చే నెలలో వర్షాలు ప్రారంభం కాగానే.. మొక్కలు నాటేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

50 రకాల పండ్ల, పూల మొక్కలు
గత విడతల్లో నర్సరీల్లో ఎక్కువ మొత్తంలో నీడనిచ్చే మొక్కలతో పాటు వేప, చింత, టేకు, మ ర్రి, ఈత, తాటి మొక్కలను పెంచేందుకు ఆసక్తి చూపారు. ఈ సారి వీటితో పాటు అధిక మొత్తం లో 50 రకాల పండ్ల, పూల మొక్కల పెంపకాన్ని కూడా చేపడుతున్నారు. జామ, దానిమ్మ, అల్లనేరేడు, మామిడి, బత్తాయితో పాటు నందివర్ధనం, మల్లె, చామంతి, బంతి తదితర పూలమొక్కల పెంపకం చేపట్టారు.

విఫలమైతే అంతే..
ఈ సారి హరితహారం లక్ష్యాన్ని వందశాతం చేరుకునేందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకే ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. మొక్కల సంరక్షణలో విఫలమైతే వారిని విధుల నుంచి తొలగించేలా పకడ్బందీ చర్యలు చేపట్టిం ది. ఈ సారి హరితహారం సక్సెస్ చేసేందుకు ప్రభు త్వం గ్రామకమిటీ ఏర్పాటు చేయనున్నది. ఈ కమిటీల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వీఆ ర్వో, వ్యవసాయ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలు, టీచర్లు, యువకు లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరందరూ మొక్కలను సంరక్షించడంతో పాటు ప్రతీ ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి, నాటేలా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే బంజ రు, బీడు, చెరువు కట్టలపై ప్రభుత్వ భూముల్లో ఎక్కువగా పండ్ల మొక్కలు పెంచేలా అధికారులు ప్రణాళికలు రెడీ చేశారు.
పచ్చదనమే ప్రధానంగా..
గ్రామాలను పచ్చదనంతో నింపడమే హరితహారం ప్రధాన ఉద్దేశం. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఈ సారి గ్రామాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసి, గ్రామ పంచాయతీలకు బాధ్యతలను అప్పగించాం. అటవీభూముల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, సంరక్షించడమే పాలకవర్గాల ప్రధాన విధి కావాలి. లక్ష్య సాధనకు సర్పంచులు, కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలి. నాటిన ప్రతీ మొక్కనూ రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. మొక్కల పెంపకంలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తేనే హరితహారం విజయవంతం అవుతుంది.
- శ్రీధర్, ధర్మపురి ఎంపీడీఓ

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles