కౌంటింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం

Sat,May 25, 2019 01:24 AM

కోరుట్ల : ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను సిద్దం చేసినట్లు జిల్లా ఎన్నికల సహాయక అధికారి శ్రీని వాస్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ మేరకు కోరుట్ల మం డలంలోని కల్లూరు గ్రామశివారులోని ఆదర్శ పాఠశాల లో కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల ప్రాదే శిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా కోరుట్ల మండలంలో జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా 15 గ్రామాలకు గాను 12 ఎంపీటీసీ స్థానాలుండగా వెంక టాపూర్, ధర్మారం, అయిలాపూర్-2 (మూడు) ఎంపీ టీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 9స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా మొత్తం ఓటర్లు 22,189 ఉన్నారు. ఇందులో పురుషులు 10,551, మహిళలు 11,628 మంది ఉన్నారు. కాగా మొత్తం 15,922 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 6,739, మహిళలు 9,553 మంది ఉన్నారు. కాగా 9 ఎంపీటీసీ స్థానాలకు గాకు ఓట్ల లెక్కింపుకు18 టేబుల్స్ ను సిద్ధం చేశారు.

కాగా ప్రతి టేబుల్‌కు రిటర్నింగ్ అధికారి, సూపర్‌వైజర్, టేబుల్ ఇన్‌చార్జి, అసిస్టెంట్లు మొత్తం ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే కథాలపూర్ మండలంలో 19 గ్రామాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలు ఎన్నికలు నిర్వహించగా మొత్తం ఓటర్లు 33,435 ఉండా పురుషులు 15,739, మహి ళలు 17,696 మంది ఓటర్లుండగా పురుషులు 10, 091, మహిళలు 14,424 మంది మొత్తం 24,515 ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఓట్ల లెక్కింపుకు 13 ఎంపీటీసీ స్థానాలకు 26 కౌంటింగ్ టే బుల్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మేడిపల్లిలో 25 గ్రా మాలకు గాను 15 ఎంపీటీసీ స్థానాలుండగా రాగోజి పేట ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా 14 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 38,158 మంది ఓటర్లుండగా పురుషులు 18,107, మహిళలు 2,251 మంది ఓటర్లుండగా 28,412 మంది ఓటు హాక్కును వినియోగించుకోగా పురుషులు 12,001, మహిళలు 16,411 మంది ఓటు హాక్కును వినియో గించుకున్నారు. కాగా ఓట్ల లెక్కింపుకు 14 ఎంపీటీసీ స్థానాలకు 28 కౌంటింగ్ టేబుల్లను ఏర్పాటు చేశారు. కాగా బారీ బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles