అర్ధగంటలో అస్తవ్యస్తం


Sat,May 25, 2019 01:24 AM

-ధర్మారం మండలంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం
-విరిగిన చెట్లు.. ఒరిగిన స్తంభాలు.. ధ్వంసమైన ఇండ్లు
-120 ఎకరాల్లో నేలరాలిన మామిడి
-నష్టంపై అంచనా వేయాలని మంత్రి కొప్పుల ఆదేశం
ధర్మారం: ధర్మారం మండలంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. నంది మే డారం, గోపాల్‌రావుపేట, సాయంపేట, బొట్లవనపర్తి గ్రామాలలో గాలివానతో తీవ్రమైన నష్టం జరిగింది. ఆయా గ్రామాలలో గాలి తాకిడికి విద్యుత్తు స్తంభాలు, చెట్లు విరిగి పడి పోగా, మామిడి కాయ లు రాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించటంతో శుక్రవారం రెవెన్యూ, ఉ ద్యాన వన శాఖ, ట్రాన్స్‌కో శాఖ సిబ్బంది ఆయా గ్రామాలలో పర్యటించి నష్టం అంచనా వేశారు. కాగా, గాలి వానతో 120 ఎకరాలలో మామిడికి నష్ట వాటిల్లిందని ఉద్యాన వనశాఖ విస్తీర్ణ అధికారి మహేశ్ వెల్లడించారు. నంది మేడారం, గోపాల్‌రావుపేట, సాయంపేట, బొట్లవనపర్తి గ్రామాల లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో అ కస్మాత్తుగా గాలి వాన కురిసింది. అరగంట పాటు ఈ వాన బీభత్సం సృష్టించిందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. గ్రామాల్లో గాలి తాకిడికి విద్యు త్ స్తంభాలు విరిగి పడగా, తీగెలు తెగి పడ్డాయి. చెట్ల కొమ్ములు విరిగి పడ్డాయి. రేకుల షెడ్లు కూ లిపోయి పలువురు నిరాశ్రయులయ్యారు. ఆయా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచి పోయి అంధకారం ఏర్పడింది. బొట్లవనపర్తి జీపీ ఎదుట ఉన్న ఎన్నో ఏళ్ల నాటి మర్రి వృక్షం కొమ్మలు విరిగి ప డ్డాయి.


గ్రామంలో గాలి వానకు పోచమ్మ గుడి వద్ద ఉన్న మర్రిచెట్టు నివాసం ఉంటున్న కొంగలు పెద్ద సంఖ్యలో మరణించాయి. 11 కేవీ విద్యుత్ తీగెలు తెగి కింద పడ్డాయి. ఇంకా గ్రామంలో ఆకారి చంద్రయ్య, బొట్ల రాజేశం, బిరుదుల వినోద్‌లకు చెందిన రేకుల షెడ్లు కూలాయి. ఆకారి సుగుణమ్మ గుడిసె గాలి తాకిడికి నేలమట్టమైంది. నంది మేడారంలో మేకల కుమార్, తాళ్ల నర్సిం గం, మాదాసు రామయ్య, బొడ్డు లచ్చయ్య, పుట్ట పోచవ్వలకు చెందిన ఇంటి రేకుల షెడ్లు కూలి పోయాయి. కందుల రాజలింగు ఇంటి ఎదుట ఉన్న తాటి చెట్టు గూన ఇంటి పై పడడంతో పాక్షికంగా ఇల్లు ధ్వంసమైంది. కోడూరి సత్తయ్య ఇంటి ముందు ఉన్న బాత్‌రూమ్ కూలి పోయింది. మా మిడి తోటలకు నష్టం వాటిల్లింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న ఉసిరి చెట్టు కూకటి వేళ్లతో కింద పడగా, వేప చెట్టు కొ మ్మలు విరిగి పడ్డాయి. సాయంపేటలో దబ్బెట ఓదయ్య ఇంటి ముందు ఉన్న రెండు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. మామిడి తోటల్లోని కా యలు రా లి రైతులకు నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు కింద పడి సరఫరా నిలిచి పోయిన గ్రామాలను ఖిలావనపర్తి సబ్ స్టేషన్ ఏఈ మహేందర్‌రెడ్డి అధ్వర్యంలో సిబ్బంది పర్యటించి వివరాలు సేకరించారు. గ్రామాలకు సాయంత్రం విద్యుత్ పునరుద్దరణ చేసినట్లు ఏఈ మహేందర్‌రెడ్డి తెలిపారు.

మంత్రి ఈశ్వర్ ఆదేశంతో కదిలిన యంత్రాంగం
నంది మేడారం, గోపాల్‌రావుపేట, సాయంపేట, బొట్లవనపర్తి గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన గాలివానతో జరిగిన నష్టంపై అంచనా వేయాలని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ సంపత్‌తో పాటు ఉద్యాన వనశాఖ, విద్యు త్ శాఖ అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. అప్రమత్తం కావడంతో ఆయా శాఖల సి బ్బంది స్పందించి గాలివాన వలన కల్గిన నష్టం గు రించి అంచనా వేశారు. బొట్లవనపర్తి, నంది మే డారం గ్రామాల్లో వీఆర్‌ఓ పర్యటించారు. నంది మేడారంలో 32 రేకుల షెడ్లు కూలినట్లు ఆయన వివరించారు. గోపాల్‌రావుపేట, సాయంపేట గ్రా మాల్లో వీఆర్‌ఓ కే రాజయ్య, ఉద్యాన వనశాఖ విసీ ్తర్ణ అధికారి మహేశ్ పర్యటించి వివరాలు సేకరించారు. సాయంపుటలో 3 రేకుల షెడ్లు కూలినట్లు వీఆర్‌ఓ రాజయ్య తెలిపారు. కాగా, హెచ్‌ఈఓ మ హేశ్ నంది మేడా రం, గోపాల్‌రావుపేట, సాయంపేట గ్రామాల్లో పర్యటించి తో టలను సందర్శించి వివరాలు సేకరించారు. నంది మేడారంలో 50 ఎకరాలు, గోపాల్‌రావుపేట, సా యంపేటలో 70 ఎకరాలు కలిపి 120 ఎకరాల్లో మా మిడి కాయలు రాలి రైతులు నష్ట పోయినట్లు అంచనా వేశామని హెచ్‌ఈఓ మహేశ్ తెలిపారు.

134

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles