మోతె పొతం

Sat,May 25, 2019 01:23 AM

- చెరువు భూములు కబ్జా
- శిఖం చదును చేసి ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు
- నిబంధనలకు విరుద్ధంగా రెచ్చిపోతున్న రియల్టర్లు
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
జగిత్యాల రూరల్ :జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం భూములకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. జిల్లా కేంద్రం శివారు గ్రామీణ ప్రాంతాలైన మో తె, ధరూర్, తిప్పన్నపేట, వెల్దుర్తి, తిమ్మాపూర్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రియల్టర్ల కన్ను శివారు గ్రామాల్లో ఖాళీ జాగలపై పడిం ది. ఊర్లలోని చెరువులు, కుంటలను యథేచ్ఛగా కబ్జా చేస్తూ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్య వహరించడం విమర్శలకు తావిస్తున్నది. ఓ వైపు ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువులు, కుంటలను అభివృద్ధి చేస్తుంటే మరో వైపు రియల్టర్లు చెరువులు, కుంటల శిఖం భూముల పొతం పెడుతూ రియల్ దందా నడిపిస్తున్నారు.

మోతె చెరువు కబ్జా
జగిత్యాల అర్బన్ మం డలం మోతె గ్రామంలో ని పెద్ద చెరువు గొలుసుకట్టు చెరువు. ఈ చెరువు ఆధారంగానే చుట్టుపక్కల గ్రా మాల్లోని ఐదు చెరువులకు నీరందుతుంది. ఇప్పుడు మోతె పెద్ద చెరు వు కబ్జాకు గురై మోతెతో పాటు పలు గ్రామాల రైతులు, మత్స్యకారులు తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. ముంపు ప్రాంతాల్లో కొందరు పట్టాల పే రుతో మట్టి పోసి చదును చేసి రియల్ ఎస్టేట్ వ్యా పారులకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ముంపు ప్రాంతాన్ని మట్టి పోసి చదును చేస్తుండగా మత్స్యకారులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు నో టీసులు జారీ చేయడంతో పనులు నిలిచిపోయా యి. గతంలో శాసనసభ, పంచాయ తీ, లోక్‌స భ, ప్రాదేశిక ఎన్నికలు వరుసగా రావడంతో అ కారులు బిజీగా మారారు. ఇదే అదునుగా భావించిన రియల్టర్లు పట్టాదారులతో కలిసి ముంపు ప్రాంతంలోని పిచ్చిమొక్కలను తొలగించి మట్టి పోసి చదును చేశారు. ముంపు ప్రాంతాన్ని కబ్జా చేస్తే రానున్న రోజుల్లో తాము ఉపాధి కోల్పోతామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు గ్రామాల చెరువులకు
-మోతె పెద్ద చెరువే ఆధారం
మోతె పెద్ద చెరువు ఆధారంగానే తిప్పనపేట శివారులోని ముప్పాల చెరువు, తిమ్మాపూర్ ఊర చెరువు, రాజుల చెరువు, లక్ష్మీపూర్ చెరువు, పొలా స ఎల్లమ్మ చెరువులకు నీరు చేరుతుంది. మోతె పెద్ద చెరువును కబ్జా చేస్తుండడంతో మిగతా ఐదు చెరువులకు సైతం నీరు ప్రవహించే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. మోతె పెద్ద చెరువు శిఖం భూమిని రియల్టర్లు కబ్జా చేస్తుం టే చెరువు నీటి సామర్థ్యం తగ్గడంతో పాటు ఇటు మత్స్యకారులు, అటు ఐదు గ్రామాల రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జా కోరల నుంచి చెరువు శిఖం భూమిని రక్షించాలని కోరుతున్నారు.

నిబంధనలకు నీళ్లు
నిబంధనల ప్రకారం చెరువుల్లో నీరున్న సమయంలో శిఖం భూముల్లో పట్టాలున్న రైతులు భూములను వదిలేసి చెరువులో నీరు లేని సమయంలో మాత్రమే పంటలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చెరువు శిఖం భూముల్లో ఎలాం టి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలున్నాయి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా మోతె పెద్ద చెరువులో కొందరు పట్టాదారులు రియల్టర్లతో కుమ్మ క్కై సుమారు రూ.2కోట్ల విలువ గల రెండెకరాల శిఖం భూమిలో మట్టి పోసి చదును చేశారు. రో డ్డు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు ప్ర యత్నాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల శాఖ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోతె చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles