అభివృద్ధికే ధర్మపురి పట్టం

Fri,May 24, 2019 04:12 AM

-నియోజకవర్గం నుంచి బోర్లకుంటకు 24,872 ఓట్ల మెజార్టీ
-ఫలించిన మంత్రి ఈశ్వర్ మంత్రాంగం
-రాత్రింబవళ్లు ప్రచారంతో పెరిగిన మద్దతు
-ఇక్కడ బీజేపీకి మూడో స్థానం

ధర్మపురి, నమస్తే తెలంగాణ : పెద్దపల్లి పార్లమెం ట్ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఎంపీ ఎన్నికల లెక్కింపు మంథనిలో గురువారం జరగ్గా టీఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేత కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 84,302 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి 4,12,294 ఓట్లు, రా గా కాంగ్రెస్ అభ్యర్థికి 3,27,992 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేశ్‌నేత గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూరు, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మారం, బుగ్గారం మండలాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు.

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్ర చారాన్ని హోరెత్తించారు. గులాబీ కార్యకర్తలు గడ ప గడపకు వెళ్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరి స్తూ ఓట్లు అభ్యర్థించడంతో ప్రజల నుంచి వెంకటేశ్ నేతకు మద్దతు పెరిగింది. దీంతో ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో 24,872 ఓట్ల మెజార్టీ లభించింది. పెద్దపెల్లి పార్లమెంట్ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో 2,82,448 మంది ఓటర్లుండగా 1,51,006 మంది తమ ఓ టుహక్కు వినియోగించుకన్నారు. ఇందులో 68, 162 ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటేశ్‌నేతకు రా గా, 43,290 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌కు, 26,775ఓట్లు బీజేపీకి పోలయ్యాయి.

రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం
ధర్మపురి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ అభ్యర్థిని రౌండ్ రౌండ్‌కు ఆధిక్యంలో నిలిపారు. మొత్తం 20 రౌండ్లుగా ఓట్లు లెక్కించగా మొదటి రౌండ్‌లోనే వెంకటేశ్‌నేతకు 3,696 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండో రౌండ్లో 3,714 ఓట్లు, 3,339, నాలుగో రౌండ్‌లో 3,401, ఐదో రౌం డ్‌లో 3,230, ఆరో రౌండ్‌లో 4,165, ఏడో రౌం డ్‌లో 4,227,ఎనిమిదో రౌండ్‌లో 4,253, తొ మ్మిదో రౌండ్‌లో 3873 ఓట్లు అధికంగా వచ్చా యి. పదో రౌండ్‌లో 3016, పదకొండో రౌండ్‌లో 3577, పన్నెండో రౌండ్‌లో 4258, పదమూడో రౌండ్‌లో 3232, పద్నాల్గో రౌండ్‌లో 3716, పదిహేనో రౌండ్‌లో 3023, పదహారో రౌండ్‌లో 3297, పదిహేడో రౌండ్‌లో 1114, పద్దెనిమిదో రౌండ్‌లో 2642, పంతోమ్మిదో రౌండ్‌లో 3421, చివరగా 20వ రౌండ్ ముగిసే సరికి 24,872 ఓట్లు ఆధిక్యంతో వెంకటేశ్‌నేత విజయకేతనం ఎగురవేశారు.

మూడో స్థానంలో కమలం..
ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి కుమార్‌కు 26,775 ఓట్లు పోలయ్యాయి. మొదటి, రెండోరౌండ్‌లో ఆధిక్యంలో రెండో స్థానంలో నిలువగా మూడో రౌండ్ నుంచి మూడో స్థానానికి పడిపోయింది.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles