హన్‌మాన్ పెద్ద జయంతిని బ్రహ్మాండంగా నిర్వహించాలి

Thu,May 23, 2019 12:34 AM

మల్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 27 నుంచి 29వరకు స్వామివారి పెద్ద జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలనీ, ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ చేయాలని జగిత్యాల కలెక్టర్ శరత్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ కోసం కొండపై అతిథి నివాస గృహంలో వివిధ శాఖల అధిపతులతో బుధవారం కలెక్టర్ శరత్ అధ్యక్షతన ఎస్పీ సింధూశర్మ, ఆలయ ఈవో అమరేందర్‌తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందు గా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని సూచించారు. చిన్న జయంతి సందర్భంగా జరిగిన లోపాలను పునరావృతం కాకుం డా చూడాలన్నారు. కొండపైన మిషన్ భగీరథ ద్వారా నీరందిస్తున్నా ఆలయ, ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. కొండపై నీటి సౌకర్యాలున్నా భక్తులకు ఎందుకు అందించడం లేదనీ, కొత్త కోనేరును ఎందుకు వినియోగంలోకి తేవడం లేదో అర్థం కావడం లేదని ఈవో తీరుపై మండిపడ్డారు.

24గంటల పాటు మిషన్ భగీరథ అధికారులు నీరందించేందుకు సిద్ధంగా ఉన్నా వినియోగించుకోవడంలో ఎందుకు భయపడుతున్నారని అడిగారు. తడకల ప్రదేశంలో విద్యుత్ లైన్ల బిగింపు పకడ్బందీగా చేపట్టాలనీ, నాణ్యత లేని వైర్లతో వేస్తే షార్ట్ సర్క్యూటై ప్రమాదాలు జరిగే అవకాశముందనీ, నాణ్యత గల విద్యుత్ వైర్లనే వాడి వాడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్లతో పాటు మాల విరమణ మండపం వద్ద పెం డ్యాల్ సిస్టమ్ ద్వారా నీడ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. భక్తులు మాల విరమణ తర్వాత స్వామి వారి దర్శనం అనంతరం లడ్డూల కౌంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ సారి అలాంటివి లేకుండా చూడాలనీ, అదనపు కౌంటర్లను ఏర్పా టు చేసి, అవసరమయ్యే సిబ్బందిని జగిత్యాల ఆర్డీవో ఘంటా నరేందర్ ఏర్పాటు చేయాలని సూ చించారు.

అనంతరం పోలీసు శాఖపై సమీక్షిస్తూ ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు కల్పించాలని ఎస్పీ సింధూ శర్మకు సూచించారు. బారికేడ్లతో ఎక్కడికక్కడ పలు ఎమర్జెన్సీ ద్వారాలు ఏర్పాటు చేసి, వీఐపీ పార్కింగ్ కోసం అన్నదాన సత్రం పక్కన చదును చేయించడం వల్ల సుమారు ఆరెకరాల స్థలాన్ని వినియోగంలోకి తెస్తామని ఎస్పీ సింధు శర్మ కలెక్టర్‌కు వివరించారు. 600మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు కల్పిస్తామని పేర్కొన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి వై జంక్షన్ వరకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles