కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

Thu,May 23, 2019 12:33 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర కౌంటింగ్ పరిశీలకుడు భవాణిరక్‌వాల్ తెలిపారు. మం డలంలోని నూకపెల్లి వీఆర్కే కళాశాలలోని కౌం టింగ్ కేంద్రానికి సంబంధించిన కౌంటింగ్ పనులను బుధవారం కేంద్ర కౌంటింగ్ పరిశీలకుడు భవాణిరక్‌వాల్, కలెక్టర్ శరత్ పరిశీలించారు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొ క్క, నియోజకవర్గానికి రెండు హాళ్లు కేటాయించామనీ, ఒక్కో హాల్‌లో 18 టేబుళ్లు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. అదే విధంగా రెండు నియోజకవర్గాలకు ఒకే విధంగా టేబుళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏజెంట్లకు ప్రత్యేక దారిని బయటి నుంచి నేరుగా కౌంటింగ్ హాల్‌కు వెళ్లేట్లు, ఏర్పాటు చేశామన్నారు. రెండు నియోజకవర్గాలకు కలిసి కౌంటింగ్ హాల్‌కు మిషన్ నేరుగా వెళ్లేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు నియోజకవర్గాలకు కలిసి కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లతో పాటు, ఒక టేబుల్‌కు ముగ్గురు చొప్పున ఉంటారని వివరించారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 286 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధూశర్మ, ఆర్డీవో జీ నరేందర్, డీఎస్పీ వెంకటరమణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలకుడు వెంకటేశ్, తాసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles