భారీ మెజార్టీతో వినోదన్న గెలుపు ఖాయం

Thu,May 23, 2019 12:33 AM

గంగాధర: కరీంనగర్ ఎంపీగా బోయినిపల్లి వినోద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లిలో బుధవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో చేసిన అభివృద్ది వినోద్‌కుమార్ గెలుపునకు కారణమవుతాయని స్పష్టం చేశారు. ఉమ్మడి రా ష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి గానీ, కరీంనగర్ ని యోజకవర్గానికి గానీ గత ప్రభుత్వాలు, నాయకులు చేసిందేమీ లేదనీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అభివృద్ధ్ది జరిగిందన్నారు. 10 లక్షల జ నాభా ఉన్న నగరాలకు మాత్రమే వచ్చే స్మార్ట్ సిటీ ని మూడున్నర లక్షల జనాభా మాత్రమే ఉన్న కరీంనగర్ నగరానికి తీసుకువచ్చిన ఘనత వినోద్‌కుమార్‌కు దక్కుతుందన్నారు. జాతీయ రహదారలంటే తెలియని కరీంనగర్ జిల్లాలో 3500 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరు చేయించారనీ, సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కొత్తపల్లి మ నోహరాబాద్‌కు రూ.750 కోట్ల నిధులు మం జూరు చేయించారనీ, పనులు కూడా వేగంగా జ రుగుతున్నాయని గుర్తు చేశారు. చొప్పదండికి సైని క్ స్కూల్‌ను మంజూరు చేయించారనీ, బోయినిపల్లి వినోద్‌కుమార్‌లాంటి నాయకులు గెలిస్తేనే మరింత అభివృద్ధ్ది జరుగుతుందని ప్రజలు గమనించారన్నారు. గులాబీ ప్రవాహంలో ప్రతిపక్షా లు కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles