అకాల వర్షం తడిసిన ధాన్యం

Wed,May 22, 2019 03:06 AM

-కొడిమ్యాల, మల్యాలలో ఈదురుగాలులతో వాన
-తిప్పాయపల్లిలో దెబ్బతిన్న రేకుల షెడ్లు, ఇండ్లు
-రాకపోకలు, విద్యుత్‌కు అంతరాయం

కొడిమ్యాల : జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానానికి వరి ధాన్యం తడిసింది. కొడిమ్యాల మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పులపై టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయి, ధాన్యం నీటిపాలైంది. కొడిమ్యాల నుంచి జేఎన్టీయూ కళాశాల వరకు, అలాగే నల్లగొండ వరకు రోడ్డుకు ఇరువైపులా పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటి పాలవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని అధికారులను వేడుకున్నారు. కాగా, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఏపీఎం దేవరాజం పరిశీలించారు.

మండలం తిప్పాయపల్లిలో శ్మశాన వాటిక వద్ద వేసిన షెడ్డు రేకులు గాలులకు కొట్టుకుపోయాయి. రేకుల కింద ఉన్న ల్యాగల బాలయ్యపై సిమెంట్ దిమ్మె పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు కరీంనగర్‌కు తరలించగా, చికిత్స పొందుతున్నాడు. దిమ్మె కూలడంతో అలాగే బాలయ్యకు చెందిన మూడు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. నర్సింహులపల్లిలో కోరెపు అశోక్ చెందిన ఇంటి పైకప్పుడు గాలులకు కొట్టుకుపోయాయి. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వీఆర్వో శ్వామ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు నమోదు చేసుకున్నారు. పూడూరులోని వెంకటసాయి ఇండస్ట్రీయల్ రేకులషెడ్డు గాలివాన బీభత్సానికి కూలిపోయింది. దీంతో షెడ్డు కింద ఉన్న 150 లారీల లోడ్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. చెప్యాల ఎక్స్‌రోడ్డు వద్ద ఫిల్లింగ్ స్టేషన్ ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగుపడడంతో సామగ్రి దగ్ధమైందని నిర్వాహకులు తెలిపారు.

ఈదుగాలుల బీభత్సం
మల్యాల : మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. మధ్యాహ్నం భారీగా వీచిన పె నుగాలులతో వర్షం కురవడంతో రేకుల షెడ్లు, ఇంటి కప్పులు కొట్టుకుపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడితోటల్లోని కాయలు రాలడంతో రైతులకు నష్టం కలిగింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం తడిసిపోయింది. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles