మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

Tue,May 21, 2019 12:52 AM

రాయికల్‌ రూరల్‌ : మత సామరస్యానికి, లౌకికత్వానికి ప్రతీకగా ఇఫ్తార్‌ నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాయికల్‌ పట్టణంలోని షాదిఖానాలో రాయికల్‌ మండలం టీఆర్‌ఎస్‌ మైనార్టీ అధ్యక్షుడు హూస్సేన్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే ఏకైక లౌకిక దేశంగా భారతదేశం ప్రత్యేకత సంతరించుకొని ఆదర్శంగా నిలు స్తుందన్నారు. మతాలు కులాలు వేరైన అంతా ఒక్కటే అనే భావనను కలిగి హిం దువులు, ముస్లింలు మత సామరస్యాన్ని చాటడం గొప్ప విషయమన్నారు. హిందు వులు, ముస్లింలు కలిసి పండగలు చేసుకోవడం భారతదేశంలో సాంప్రదాయంగా మారిందన్నారు. అనంతరం ముస్లింలతో కలిసి ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల తిరుపతి, యువజన అధ్య క్షుడు ఎలిగేటి అనిల్‌, పట్టణాధ్యక్షుడు మోర రామ్మూర్తి, మోర హన్మండ్లు, ఇం త్యాజ్‌, నయీమ్‌, సోహయిల్‌, అచ్యుత్‌ రావు, లింగం గౌడ్‌, చంద్రతేజ పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles