‘పరిషత్‌' కౌంటింగ్‌

Tue,May 21, 2019 12:51 AM

గొల్లపల్లి : స్థానిక ఆదర్శ పాఠశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీఓ నవీన్‌కుమార్‌ తెలిపారు. మోడల్‌ స్కూ ల్‌లో గొల్లపల్లితో పాటు, పెగడపల్లి, వెల్గటూర్‌ మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఈ నెల 27న జరుగనుంది. గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో 13 చొప్పున ఎంపీటీసీలు, వెల్గటూర్‌లో 15 మంది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు రెండు టేబుళ్లు ఏర్పాటు చేశామనీ, 500 ఓ ట్ల చొప్పున రౌండ్‌కు వెయ్యి ఓట్లును లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి, ప్రతీ రౌండ్‌కు వెయ్యి కౌంట్‌ చేస్తామని చెప్పారు. ఒక్కో మండలానికి మూడు కౌంటింగ్‌ హాల్‌లు కే టాయించినట్లు తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఒక్కో ఎంపీటీసీ అభ్యర్థులు ఇద్దరు కౌంటింగ్‌ ఏ జెంట్లను నియమించుకోవాలనీ, జడ్పీడీసీ అభ్యర్థులు టేబుల్‌కు ఒక్కరు చొప్పున ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్ల ఫొటోలతో కూడిన వివరాలను మండల పరిషత్‌ కార్యాలయంలో అందిస్తే, పాస్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
నేడు సిబ్బందికి శిక్షణ
స్థానిక ఆర్యవైశ్య సంఘ భవనంలో మంగళవారం ఉదయం 10 గంటలకు గొల్లపల్లి, పెగడపల్లి మండలాల ఓట్ల కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ నవీన్‌కుమార్‌ తెలిపారు. చెల్లని ఓట్లు, లైన్‌ మీద ఉన్న ఓట్లను ఎలా పరిగణించాలి అనే దానిపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles