కౌంటింగ్‌ శిక్షణలో కలెక్టర్‌ శరత్‌

Tue,May 21, 2019 12:51 AM

జగిత్యాల కలెక్టరేట్‌: పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో జగిత్యాల కలెక్టర్‌ శరత్‌ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు, లెక్కింపునకు సంబంధించిన అంశాలపై ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద లెక్కింపును సకాలంలో ప్రారంభించాలనీ, కౌం టింగ్‌ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆదేశించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 5 ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సి ఉంటుందన్నారు. లెక్కింపు సందర్భంగా కూలర్లు, ఫ్యాన్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలనీ, వాటికి ప్రత్యామ్నాయంగా ఏసీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపు పూర్తయిన తర్వాత కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్నికల కమిషన్‌ సభ్యులు అధికారులకు సూచించారు. రౌండ్ల వారీగా కౌంటింగ్‌ ముగిసిన అనంతరం ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆ వివరాలను స్వయంగా రి టర్నింగ్‌ అధికారి మాత్రమే నమోదు చేయాలనీ, అనంతరం ఫలితాలను బయటకు విడుదల చేయాలని తెలిపారు. కౌంటింగ్‌ సందర్భంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్‌ అధికారులకు, ఏఆర్‌వోలకు శిక్షణ ఇచ్చారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles