భూసార పరీక్ష.. పంటకు రక్ష


Sun,May 19, 2019 01:30 AM

మారుతినగర్: భూసార పరీక్షలతో నాణ్యమైన దిగుబడిని పొందడానికి ప్రభుత్వం రైతులు పండించే పంటలపై ప్రత్యేక దృష్టిని సారించి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి సుమారు 4,865 హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాల్లోని 6,028 మంది రైతుల మట్టి నమూనాలను సేకరించారు. ఆన్‌లైన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ భూసార పరీక్షల కార్డుల పంపిణీకి వ్యవసాయాధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నేల స్వభావం, నీటి వసతికి అనుగుణంగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో నాణ్యమైన పంటలు పండించాలంటే, అధిక దిగుబడి రావాలంటే భూసార పరీక్షలు ఎంతో దోహదపడతాయి. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి వ్యవసాయాధికారులతో మండలంలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి వందశాతం భూసార పరీక్షలు చేపట్టేందుకు మట్టి నమూనాలు సేకరించారు. కాగా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో నీటిపారుదల, వ్యవసాయ బోరు, బావుల ద్వారా పంటలు పండించే రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వ్యవసాయాధికారులు వేగవంతం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతు పొలాల్లో సేకరించిన మట్టి నమూనాల్లోని సూక్ష్మ పోషకాల భూసార పరీక్షల ఆధారంగా రైతులు ఏయే పంటలను వేయాలి.., ఆ పంటలకు ఏ మోతాదులో ఎరువులు వాడాలి.. తదితర అంశాలతో కూడిన భూసార పరీక్షల కార్డులను ఇచ్చేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపడుతోంది. తద్వారా నాణ్యమైన పంటలను పండించి లాభసాటి దిగుబడిని పొందే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.


పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలు
జిల్లాలోని పైలెట్ ప్రాజెక్టు కింద 18 మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున 18 గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో మల్యాల మండలంలోని రాజారాం, మేడిపల్లి మండలంలో దమ్మన్నపేట, బీర్‌పూర్ మండలంలో రంగసాగర్ జగిత్యాల అర్బన్‌లో ధరూర్, సారంగాపూర్ మండలంలో లచ్చక్కపేట, జగిత్యాల రూరల్‌లో తక్కల్లపెల్లి, కొడిమ్యాల మండలంలో శనివారంపేట్, రాయికల్ మండలంలోని చింతలూరు, ఇబ్రహీంపట్నం మండలంలో కొజన్‌కొత్తూర్, మెట్‌పల్లి మండలంలో విట్టంపేట్, కోరుట్ల మండలంలో నాగులపేట్, కథలాపూర్ మండలంలో పోతారం, మల్లాపూర్ మండలంలో సిర్‌పూర్, ధర్మపురి మండలంలో తీగల ధర్మారం, బుగ్గారం మండలంలో చిన్నప, గొల్లపల్లి మండలంలో రాపెల్లి, పెగడపల్లి మండలంలో కీచులపల్లి, వెల్గటూర్ మండలంలో కొత్తపేట గ్రామాలను వ్యవసాయాధికారులు ఎంపిక చేశారు.
ఎంపికైన గ్రామాలవారీగా నమూనాలు
మల్యాల మండలంలోని రాజారాం గ్రామంలోని 352 రైతులకు సంబంధించిన నీటి పారుదల, వర్షాధారిత 255 హెక్టార్ల భూములను వ్యవసాయాధికారులు పరిశీలించి మట్టి నమూనాలను సేకరించారు. మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేటలో 204మంది రైతుల 192 హెక్టార్లు, బీర్‌పూర్ మండలంలోని రంగసాగర్‌లో 206 మంది రైతుల 184 హెక్టార్లు, జగిత్యాల అర్బన్ ధరూర్‌లో 545 మంది రైతుల 276 హెక్టార్లు, సారంగాపూర్ మండలంలోని లచ్చక్కపేటలో 209 మంది రైతుల 380 హెక్టార్లు, జగిత్యాల రూరల్ తక్కళ్లపల్లిలో 350 మంది రైతుల 309 హెక్టార్లు, కొడిమ్యాల మండలం శనిగారంపేట్‌లో 136 మంది రైతుల 147 హెక్టార్లు, రాయికల్ మండలంలోని చింతలూర్‌లో 424 మంది రైతుల 372 హెక్టార్లు, ఇబ్రహీంపట్నం మండలంలోని కొజన్‌కొత్తూర్‌లో 205 మంది రైతుల 144హెక్టార్లు, మెట్‌పల్లి మండలంలోని విట్టంపేటలో 273 మంది రైతుల 248 హెక్టార్లు, కోరుట్ల మండలంలోని నాగులపేటలో 524 మంది రైతుల 448హెక్టార్లు, కథలాపూర్ మండలంలోని పోతారంలో 321 మంది రైతుల 274 హెక్టార్లు, మల్లాపూర్ మండలంలోని సిరిపుర్‌లో 263 మంది రైతుల 94 హెక్టార్లు, ధర్మపురి మండలంలోని తీగల ధర్మారంలో 260 మంది రైతుల 341 హెక్టార్లు, బుగ్గారం మండలంలోని చిన్నపిలో 344 మంది రైతుల 290 హెక్టార్లు, గొల్లపల్లి మండలంలోని రాపల్లిలో 582 మంది రైతుల 466 హెక్టార్లు, పెగడపల్లి మండలంలోని కీచులాలపల్లిలో 168 మంది రైతుల 130 హెక్టార్లు, వెల్గటూరు మండలంలోని కొత్తపేటలో 662 మంది రైతుల 315 హెక్టార్లులోని భూముల మట్టి నమూనాలు మొత్తం జిల్లాలోని 18 గ్రామాల్లోని 6,028మంది రైతులకు సంబంధించిన నీటిపారుదల భూమి 3863 హెక్టార్లు, 1,003హెక్టార్ల వర్షాధార భూముల్లోని మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి తరలించారు.

135

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles