రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం

Sun,May 19, 2019 01:27 AM

కొడిమ్యాల : రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలం చెప్యాలలో మిష న్ కాకతీయ మూడో విడతలో భాగంగా రూ.63లక్షలతో చేపడుతున్న చెరువు పునరుద్ధరణ పనుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని పథకాలు అమలు చేసిందన్నారు. చెరువుల పునరుద్ధరణతో రైతులకు అనేక లాభాలున్నాయన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో చెరువును నింపి వందలాది ఎకరాల్లోని ఆయకట్టుకు నీరందిస్తున్నట్లు గుర్తు చేశా రు. అలాగే చేపల పెంపకం ద్వారా ముదిరాజ్‌లకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. రైతు లు చెరువులోని పూడిక మట్టిని పొలాలకు తరలించుకోవాలనీ, తద్వారా భూమి సారవంతంగా మారి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. చెరువు కట్టను ఆధునీకరించి, ఈత మొక్కలను పెంచుతామని, దీంతో గౌడ కులస్థులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదనీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు ఎల్లంపల్లి నీటితో నింపి పంటలకు నీరందిస్తున్నామన్నారు. అలాగే రైతుబంధుతో ఎకరానికి రూ.8వేల సాయం, రైతుబీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామగ్రామాన కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. దేశానికే అర్థమైన పాలనను సీఎం కేసీఆర్ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పులి వెంకటేశం, ఆయా గ్రామాల సర్పంచులు వుట్కూరి రాజశేఖర్‌రెడ్డి, పునుగోటి కృష్ణారావు, గరిగంటి మల్లేశం, పిల్లి మల్లేశం, టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు పర్లపల్లి ప్రసాద్, వుట్కూరి మల్లారెడ్డి, నాయకులు మొగిలిపాలెం శ్రీనివాస్, చిర్ర శ్రీనివాస్, గజ్జేల నవీన్, బోలుమాల్ల గంగారాజం ఉన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles