హరితహారానికి ప్రణాళికలు సిద్ధం..

Sun,May 19, 2019 01:27 AM

సారంగాపూర్ : సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు మండలాల్లో 16.17లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముదుకు వెళ్తున్నారు. ప్రస్తుతం సారంగాపూర్, బీర్‌పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో జులై నెలలో నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని విజయవం తం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. సారంగాపూర్, బీర్‌పూర్ మం డలాల్లోని ఆయా గ్రామాల్లో 23 నర్సరీలను ఏ ర్పాటు చేసి జనాభా ప్రతి పాధికన గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని అటవీ భూములు, వ్యవసాయ భూ ముల గట్లపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. అటవీశాఖ, డ్వామ ఆధ్వర్యంలో మొక్క లు నాటేందుకు ఆయా నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి గ్రామం ప్రారంభంలో, గ్రామం చివరలో, పొలంగట్లు, ప్రధాన రహదారులు, ఖాళీ స్థలాల్లో, బీడు భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్సారెస్పీ కెనాల్ పక్కన, రహదారుల పక్కన, చెరువు, పొలం గట్ల, అటవిభూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ, డ్వామా ద్వారా అధికారులు ఏర్పాట్లు చేశారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో వివిధ ప్రాంతాలను గుర్తించి మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తయారు చేయనున్నట్లు ఎంపీడీవో పుల్ల య్య, ఏపీఓ రాజేందర్ పేర్కొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles