ధాన్యం తూకంలో కోతపై ఆందోళన

Sun,May 19, 2019 01:27 AM

మల్యాల: మండలంలోని లంబాడిపల్లి గ్రామం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. కేంద్రంలో రైతు వద్ద నుంచి ఒక్కో బస్తా లో సంచి బరువుతో పాటు 40కిలోల ధాన్యాన్ని సేకరిస్తున్నారు. 20రోజులుగా కొనుగోలు కేంద్రం లో ధాన్యం సేకరిస్తున్నప్పటికీ లారీల్లో ధాన్యాన్ని మిల్లుకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో మిల్లర్ వద్ద తూకం తక్కువగా చూపించడంతో రైతుల ధాన్యం నుంచి కోత విధిస్తామనడంతో వారు ఆందోళనకు దిగారు. తమ వద్ద నుంచి కొనుగోలు చేసినప్పుడు ఒక్కో బస్తాకు 40కిలోల పైచిలుకు సేకరించినప్పటికీ ధాన్యం తూకం ఎలా తగ్గుతుందని రైతులు ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఐకేపీ సీసీ కలుగజేసుకొని మిల్లర్‌కు తూకంలో తక్కువగా వచ్చిన మొత్తాన్ని 50శాతం రైతు, 50శాతం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు భరించాలనడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, 12లారీల్లో ధాన్యాన్ని తరలించినప్పటికీ 11క్వింటాళ్ల ధాన్యం తూకంలో తేడా రావడం ప్రశ్నార్థకంగా మిగిలింది.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles