వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జాతర

Sun,May 19, 2019 01:27 AM

ధర్మారం: ధర్మారం మండలం పత్తిపాక లక్ష్మీనరసింహ స్వామి జాతర మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి ఇక్కడ స్వామి వారి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజు ఆలయం వద్ద జాతర ఉత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుట్ట కింద ఉన్న రథంలో లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజలు చేశారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య రథాన్ని లాగగా, జాతర ప్రారంభమైంది. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి ఎదురు మొక్కులు మొక్కి మేక పోతులు, కోళ్లను బలి ఇచ్చారు. కార్యక్రమంలో పత్తిపాక, నాయకంపల్లి సర్పంచులు బద్దం సుజాత, భూక్య లావణ్య, ఎంపీటీసీ సభ్యురాలు నోముల పుష్పలత, ఉప సర్పంచులు బండారి శ్రీనివాస్, నునావత్ శ్యామల, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ నీలం నర్సయ్య, ఆలయ ధర్మకర్తలు, టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోయెడ రవీందర్, నాయకులు నోముల వెంకటరెడ్డి, బద్దం రవీందర్‌రెడ్డి, బద్దం మోహన్‌రెడ్డి, మెన్నేని వెంకటేశ్వర్‌రావు, మెన్నేని రాంబాబు, ఏదుల్ల రాజారాం, ఏదుల్ల ప్రభాకర్ పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles